కర్నూలు జిల్లాలో కర్రల సమరానికి సిద్ధమవుతోంది హోళగుంద మండలం దేవరగట్టు. మాలమల్లేశ్వరస్వామి దసరా ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు, ఎస్పీ సిద్దార్ధ కౌశిల్. బన్ని ఉత్సవాల నిర్వహణ, భక్తుల సౌకర్యాలపై అన్ని శాఖల అధికారులతో.. సమీక్ష నిర్వహించారు. దసరా పండగ రోజు రాత్రి జరిగే కర్రల సమరాన్ని ప్రశాంత వాతావరణంలో భక్తులు జరుపుకోవాలన్నారు. అవాంచనీయ ఘటనలు జరగకుండా… భక్తులు పోలీసులకు సహకరించాలన్నారు జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశిల్…
ఆంధ్ర, కర్ణాటక సరిహద్దు గ్రామాల భక్త జనానికి దసరా అనగానే గుర్తుకొచ్చేది దేవరగట్టు. ఇది రాక్షసులపై దేవతలు సాధించిన విజయానికి గుర్తుగా జరిపేజైత్రయాత్ర (బన్ని). నిశిరాత్రి వేళ… కాగడాల వెలుగులో… డిర్ర్ర్ర్ర్ర్ గోపరాక్ (బహుపరాక్) అంటూ వేలాది మంది తమ ఇష్ట దైవం శ్రీమాళా సమేత మల్లేశ్వరస్వామి రక్షణార్థులై సాగించే ఈ మహోత్సవంలో కర్రలు ఖడ్గాల్లా విన్యాసాలు చేస్తాయి. నెత్తురు ధారలు కడుతుంది.