పోలీసులను ఆశ్రయించిన సినీ నటి కరాటే కళ్యాణి..

సినీ నటి కరాటే కళ్యాణి సీసీఎస్ పోలీసులను ఆశ్రయించారు. తన పాత ఫోటోలు, గతంలో తాను నటించిన సినిమా సన్నివేశాలకు సంబంధించిన ఫోటోలు మార్ఫింగ్ చేస్తున్నారని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసభ్యకర రీతిలో మార్ఫింగ్ చేస్తూ వాటిని వైరల్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కరాటే కళ్యాణి ఫిర్యాదుతో పోలీసులు 469, 506, 509 ఐపీసీ సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు. తన ఎదుగుదలను తట్టుకోలేకే ప్రత్యర్థులు తనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని కళ్యాణి ఆరోపించారు.