కరివేపాకు జ్యూస్ తాగితే బరువు తగ్గుతారా..

కరివేపాకు..ఎన్నో గుణాలున్న ఈ ఆకులని మనం వంటల్లో వాడుతుంటాం. వీటిని వాడడం వల్ల వల్ల రుచి, వాసన మాత్రమే కాదు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయిన చెబుతున్నారు నిపుణులు. బరువుని తగ్గించడంలో ఈ జ్యూస్ అద్భుతంగా పనిచేస్తుందని చెబుతున్నారు. అందరికీ అందుబాటులో ఉండే ఈ జ్యూస్ తాగడం వల్ల బరువు తగ్గడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు…పప్పూ, సాంబార్, ఉప్మా లో కరివేపాకు తో తాలింపు పెడితే వచ్చే రుచే వేరు. కరివేపాకుకి మంచి రుచీ సువాసనా కూడా ఉన్నాయి. వాటితో పాటూ ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. దీన్ని ఆహారంలో భాగం చేసుకోవడం తో పాటూ కరివేపాకు జ్యూస్ ని పొద్దున్నే తాగితే బరువు తగ్గడం తో పాటూ ఇంకా ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు…దూరమై మలబద్ధకం వంటి సమస్యలు కూడా దూరం అవుతాయి. ఈ మధ్యకాలంలో చాలా మంది ప్రోటీన్ షేక్స్ అంటూ మార్కెట్లో లభించే రకరకాల పౌడర్స్‌ని తాగుతున్నారు. వాటికి బదులు అందరికీ అందుబాటులో ఉండే ఈ ఈ జ్యూస్‌ని తాగడం వల్ల బరువు కచ్చితంగా తగ్గుతారు.!