భారీగా కర్ణాటక మద్యం పాకెట్లు స్వాధీనం..13 బాక్సులలో తేట్రా పాకెట్లు, కారు సీజ్…

కర్నూల్ శివారులోని పంచ లింగాల అంతరాష్ట్ర చెక్ పోస్ట్ నందు శనివారం సి ఐ మంజుల మరియు యస్ఐ ప్రవీణ్ కుమార్ నాయక్ మరియు సేబ్ సిబ్బంది చేపట్టిన తనిఖీల్లో తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ వైపు నుండి కర్నూలు వెళ్తున్న మహీంద్రా వెరిటో కారు
(AP 31 TV 4678) రాగా, కారును సిబ్బంది ఆపడానికి ప్రయత్నం చేయగా ,, డ్రైవర్ ఆప కుండా పారిపోయాడు,,,కారును యస్ ఐ గారు చేస్ చేసి సిబ్బంది సహాయంతో పట్టుకున్నారు,కారు ను తనిఖీ చేయగా అందులో 13 బాక్సులొ కర్ణాటక మద్యం 96*13=1248 తేట్రా పాకెట్స్ స్వాధీనం చేసుకున్నారు . వీటి విలువ సుమారు 36 వేలు ఉంటుందని సెబ్ సి ఐ తెలిపారు. పట్టుబడిన మద్యం మరియు కారును కర్నూల్ సెబ్ పోలీసు స్టేషన్ లో తదుపరి విచారణ నిమిత్తం అప్పగించినట్లు సిఐ మంజుల తెలిపారు.
ఈ తనిఖీల్లో, కానిస్టేబుల్ శాంతరాజు, శ్రీనివాసులు పాల్గొన్నారు..