మామను దారుణంగా కొట్టిన కోడలు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..

మామను దారుణంగా కొట్టిన కోడలు..

కర్ణాటకలో మామపై దాడి చేసిన మహిళను పోలీసులు అరెస్టు చేశారు. మంగళూరుకు చెందిన ఉమాశంకరి ఎలక్ట్రిసిటీ బోర్డులో ఉద్యోగి. భర్త విదేశాల్లో ఉండడంతో అత్తమామలతో కలిసి ఒకే ఇంట్లో ఉంటోంది. మార్చి 9న ఆమె మేనమామ పద్మనాభ సువర్ణ (87) తన చొక్కాను సోఫాపై పెట్టడంతో చితకబాదారు. వాకింగ్ స్టిక్ తో దారుణంగా కొట్టారు. బలంగా నెట్టడంతో తల సోఫాకు తగిలి గాయమైంది. ఇదంతా ఇంట్లోని సీసీ కెమెరాలో రికార్డయింది. ప్రస్తుతం, ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది…మామ సోఫా మీద షర్ట్ ఉంచాడని కోడలు చేతి కర్రతో అతనిపై దాడి చేసింది. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. వృద్ధుడి కూతురు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తీవ్ర గాయాలపాలైన వృద్ధుడు ప్రస్తుతం ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఉమా శంకరిని పోలీసులు అరెస్టు చేశారు. ఈమె అట్టవార్‌లోని ఎలక్ట్రిసిటీ ప్రొవైడర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఉమాపై కఠిన చర్యలు తీసుకోవాలని పద్మనాభ కూతురు డిమాండ్ చేసింది..