హైదరాబాద్​కు వస్తున్న బస్సులో మంటలు.. ఎనిమిది మంది దుర్మరణం

*హైదరాబాద్​కు వస్తున్న బస్సులో మంటలు.. ఎనిమిది దుర్మరణం..!

మృతుల్లో తెలంగాణా వారు…!

కర్ణాటక కలబురగిలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఓ లారీని ఢీకొట్టి బస్సు బోల్తాపడగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు 8మంది మరణించినట్లు సమాచారం. బస్సులో డ్రైవర్​తో పాటు మరో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. 12 మందిని రక్షించి ఆస్పత్రికి తరలించారు. బీదర్​-శ్రీరంగపట్టణం హైవేపై కమలాపుర వద్ద శుక్రవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో దుర్ఘటన చోటుచేసుకుంది.
బస్సు గోవా నుంచి హైదరాబాద్​ వస్తున్నట్లు తెలుస్తోంది. మృతులంతా హైదరాబాద్​కు చెందినవారేనని సమాచారం. బస్సును గోవాలోని ఆరెంజ్​ కంపెనీకి చెందినదిగా గుర్తించారు.