బెంగళూరులో బస్టాండ్ ఎత్తుకుపోయిన దొంగలు

బెంగళూరులో బస్టాండ్ ఎత్తుకుపోయిన దొంగలు..

కర్ణాటక – బెంగళూరులో 10 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన బస్టాండును దొంగలు ఎత్తుకుపోయారు.

బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్టేషన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్టీల్ నిర్మాణంతో ఏర్పాటు చేసిన బస్టాండును దొంగలు మాయం చేశారు…

ఇక్కడ ఒక బస్టాండ్ ఉండాలి మీకు ఏమైనా తెలుసా అని అడిగే పరిస్థితిలో ప్రయాణికులు భావిస్తున్నారు… రాత్రికి రాత్రి బస్టాండ్ ఎత్తుకుపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది..

కర్ణాటకలో బస్టాప్‌ను దుండగులు ఎత్తుకెళ్లిపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఆ బస్టాప్ ఏదో మారు మూల ప్రాంతంలో ఉంది అనుకుంటే పొరపాటే. ఎందుకంటే అది రాజధాని బెంగళూరు నడిబొడ్డున కర్ణాటక రాష్ట్ర శాసనసభకు కిలో మీటర్ దూరంలోనే ఉండటం విశేషం. ఇక ఆ బస్టాప్‌ నిర్మాణానికి రూ.10 లక్షలు ఖర్చు కాగా.. దాన్ని ప్రారంభించిన 10 రోజులకే దాన్ని ఎత్తుకెళ్లిపోయారు. అయితే ఈ ఘటనపై సంబంధిత అధికారులు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు..రద్దీగా ఉండే కన్నింగ్‌హామ్‌ రోడ్‌లో ఈ బస్టాప్‌ను నిర్మించారు. ఈ బస్టాప్ నిర్మాణాన్ని బృహత్ బెంగళూరు మహానగర పాలిక-బీబీఎంపీ.. స్థానికంగా ఉన్న ఓ కంపెనీకి పనులు అప్పగించారు. అయితే ఈ బస్టాప్‌ను రూ. 10 లక్షలు వెచ్చించి నిర్మాణం పూర్తి చేశారు. అయితే ఈ బస్టాప్‌ నిర్మించిన పది రోజులకే దాన్ని దుండగులు ఎత్తుకెళ్లారు. అయితే ఈ ఘటనపై బస్టాప్ నిర్మించిన కంపెనీ అధికారు రవిరెడ్డి.. సెప్టెంబర్ 30 వ తేదీన స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు.

ఆ బస్ షెల్టర్‌ను స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారు చేశామని.. దానికి మొత్తం రూ.10 లక్షల ఖర్చు వచ్చినట్లు తెలిపారు. అయితే ఆ బస్టాప్‌తోపాటు దానికి ఉన్న స్టీల్ కడ్డీలు మొత్తం దొంగలు ఎత్తుకెళ్లిపోయారని ఫిర్యాదులో తెలిపారు. దీంతో ఆ కంపెనీ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఐపీసీ సెక్షన్ 279 కింద కేసు నమోదు చేశారు. ఆ బస్ షెల్టర్‌ను ఆగస్టు 21 వ తేదీన ఏర్పాటు చేశామని.. అయితే ఆగస్టు 28 వ తేదీన బస్టాప్‌ను చూసేందుకు వెళ్లగా అక్కడ ఏమీ కనిపించలేదని తెలిపారు. అయితే ఈ బస్టాప్ దొంగతనం జరిగిన నెల రోజుల తర్వాత సదరు కంపెనీ పోలీసులకు ఫిర్యాదు చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే బస్టాప్ కనిపించకపోవడంతో బృహత్ బెంగళూరు మెట్రోపాలిక అధికారులను సదరు కంపెనీ ప్రశ్నించగా.. వారు తమకేమీ తెలియదని సమాధానం ఇచ్చారు…