కర్ణాటక రైతులకు శుభవార్త చెప్పిన సీఎం సిద్దరామయ్య!..

కర్ణాటక రైతులకు శుభవార్త చెప్పిన సీఎం సిద్దరామయ్య!

ఎంత ఖర్చయినా ఇతర రాష్ట్రాల నుండి విద్యుత్ కొని రాష్ట్రంలోని రైతులకు రెండు విడతల్లో ఏడు గంటల విద్యుత్ సరఫరా చేసి తీరుతామని కర్ణాటక సీఎం సిద్దరామయ్య ప్రకటించారు.

ఇటీవల విద్యుత్ కోతలతో సంక్షోభం ఎదుర్కొంటున్న రాష్ట్రంలో సీఎం సిద్దరామయ్య, విద్యుత్ శాఖా మంత్రి కేజే జార్జ్ నిన్న రివ్యూ సమావేశం నిర్వహించి ఎట్టిపరిస్థితుల్లో రెండు విడతల్లో రైతులకు ఏడు గంటల విద్యుత్ సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు.