బెంగళూరు: కర్నాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం.. డీకేతో ప్రమాణస్వీకారం చేయించిన గవర్నర్.
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు వీడీ సతీశన్, ఎ.రేవంత్ రెడ్డి, సుఖ్వీందర్ సింగ్ సుఖు, డీకే శివకుమార్ భార్య ఉషా శివకుమార్, కుమార్తె, పలువురు ఆధ్యాత్మిక నేతలు, విద్యార్థి, పౌరకార్మిక, రైతు ప్రతినిధులు, దళిత నేతలు, కన్నడ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మంత్రులుగా..
కాగా, డీకే శివకుమార్ క్యాబినెట్ మంత్రులు 13 మంది చేత గవర్నర్ గెహ్లాట్ తావర్చందర్ గెహ్లాట్ ప్రమాణస్వీకారం చేయించారు. వీరిలో కేజీ జార్జ్, జి.పరమేశ్వర, రామలింగా రెడ్డి, కృష్ణ బైరే గౌడ, యూటీ ఖాదెర్, ఎంబీ పాటిల్, సతీశ్ జార్కిహోళి, ప్రియాంక ఘర్గే, యతీంద్ర సిద్ధరామ్యయ, లక్ష్మీ హెబ్బాల్కర్ ఉన్నారు.