కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు షాక్… పదవులు ఇస్తానంటూ లంచం తీసుకున్న కేసులు రి ఓపెన్..!!!

అధికార పార్టీలో పదవులు ఇస్తానంటూ లంచం అందుకున్నారని ఆరోపణలు వచ్చిన కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు న్యాయపరమైన చిక్కులు ఎదురైనాయి. సీఎం సిద్ధరామయ్యపై వేసిన కేసులో అధికారులు సమర్పించిన బి రిపోర్ట్‌ను తిరస్కరిస్తూ ప్రత్యేక న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది…బెంగళూరుకు చెందిన బీజేపీ నేత, బీబీఎంపీ మాజీ కార్పొరేటర్ ఎన్. ఆర్. రమేష్ నమోదు చేసిన కేసులో బి రిపోర్టు సమర్పించారు..అయితే సీఎం సిద్దరామయ్య మీద అధికారులు కోర్టులో సమర్పించిన బి రిపోర్టును కోర్టు తోసిపుచ్చింది. ఈ కేసుపై మళ్లీ విచారణ జరిపి నివేదిక సమర్పించాలని లోకాయుక్త అధికారులకు ప్రత్యేక కోర్టు ఆదేశించింది. ఆరు నెలల్లోగా సీఎం సిద్దరామయ్య మీద నమోదు అయిన కేసును మళ్లీ విచారించి నివేదిక సమర్పించాలని ప్రత్యేక కోర్టు లోకాయుక్త పోలీసు అధికారులకు ఆదేశించింది…టర్ఫ్‌ క్లబ్‌ స్టీవార్డ్‌ పదవి ఇచ్చేందుకు సిద్ధరామయ్య చెక్కు ద్వారా రూ.1.30 కోట్లు లంచంగా అందుకున్నారని బీజేపీ నాయకుడు ఎన్ఆర్ రమేష్ ఆరోపించారు. ఇదే విషయంలో సీెం సిద్దరామయ్య మీద బీజేపీ నేత ఎన్. ఆర్. రమేష్ సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. బీజేపీ నాయకుడు రమేష్ ఫిర్యాదుపై విచారణ జరిపిన లోకాయుక్త పోలీసులు ఫిర్యాదుదారు ఎన్ఆర్ రమేష్ చేసిన ఆరోపణలకు సాక్షులు ఏమీ లేవని పేర్కొంటూ కేసును మూసివేసి కోర్టులో బి రిపోర్డు సమర్పించారు…అయితే లోకాయుక్త పోలీసులు సమర్పించిన బి రిపోర్ట్‌ ను సవాల్ చేస్తూ ఎన్‌ఆర్ రమేష్ మళ్లీ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో సీఎం సిద్దరామయ్యకు ముడుపులు అందాయని, మరిన్ని పత్రాలు ఇచ్చారని ఆరోపించారు. సీఎం సిద్దరామయ్య వివాద పిటిషన్‌ను దాఖలు చేసి తిరిగి దర్యాప్తు చేయాలని బీజేపీ నాయకుడు ఎన్ఆర్ రమేష్ కోర్టును అభ్యర్థించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ప్రత్యేక న్యాయస్థానం కేసును మళ్లీ విచారించి నివేదిక సమర్పించాలని లోకాయుక్త పోలీసులను ఆదేశించి. కేసు విచారణను ఇదే ఏడాది ఆగస్టు 22కి వాయిదా వేసింది…