కర్ణాటక డిప్యూటీ సీఎంపై కేసు నమోదుకు హైకోర్టు ఆదేశం…

బెంగళూరు: భాజపా నేతలు నిరసన తెలిపే చిత్రాన్ని మార్ఫింగ్ చేసినందుకు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో పాటు కాంగ్రెస్ రాష్ట్ర ఐటీ సెల్  హెడ్ బీఆర్ నాయుడుపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీసులను ప్రత్యేక కోర్టు ఆదేశించింది. 
1992లో బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో ఆందోళనలో పాల్గొన్న కరసేవక్ శ్రీకాంత్ పూజారిని పోలీసులు ఇటీవల అరెస్టు చేసినందుకు వ్యతిరేకంగా భాజపా నాయకులు నిరసన చేపట్టారు. ఇందులోభాగంగా వారు ‘నేను కూడా కరసేవక్‌నే, నన్ను కూడా అరెస్టు చేయండి’ అని రాసున్న ప్లకార్డులను పట్టుకొని నిరసన తెలిపారు.
కాంగ్రెస్ ఐటీ సెల్ ప్లకార్డులపై ఉన్న రాతలను మార్చి మోసాలు, ఇతర అక్రమాలు మేమే చేశాం అనే అర్థం వచ్చేలా మార్ఫింగ్‌ చేసి సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేసింది. ఇదే విషయాన్ని కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ శివకుమార్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.  భాజపా నాయకులను అవమానపరిచేలా దీనిని కాంగ్రెస్‌ నేతలు మార్చారని పేర్కొంటూ భాజపా లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ యోగేంద్ర హోడఘట్ట, ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రత్యేక కోర్టులో ఫిర్యాదు చేశారు.  దీంతో చిత్రాన్ని మార్ఫింగ్‌ చేసినవారిపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది..