కర్ణాటకలో గైడెన్స్ వాల్యూ పేరిట రిజిస్ట్రేషన్లపై టాక్స్ పెంచేసిన కాంగ్రెస్ సర్కార్…
ఎన్నికల్లో ఇచ్చిన అడ్డగోలు హామీలు నెరవేర్చేందుకు రెవెన్యూ భర్తీ చేసేందుకు అడ్డగోలుగా టాక్స్ వడ్డింపు. ఈరోజు నుండి అమలు.
బెంగళూరు లో కార్ పూలింగ్‌ను నిషేధించిన కాంగ్రెస్ ప్రభుత్వం
కొత్త నిబంధనల ప్రకారం కార్ పూలింగ్ వాడుకుంటే రూ.10,000 వరకు జరిమానా..
బెంగళూరులోని కమర్షియల్ స్థలాలపై 25% నుండి 70% పెంపు. ఎలక్ట్రానిక్ సిటీలో చదరపు అడుగుకు రూ.500 నుండి రూ.750 వరకు పన్ను వాయింపు…కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో ‘పొలిటికల్ ఎలక్షన్ ట్యాక్స్’ను వసూలు చేస్తోందని అన్నారు. బెంగళూరు నగరంలో బిల్డర్ల నుంచి చదరపు అడుగుకు రూ.500ను అదనంగా వసూలు చేస్తోందని ఆరోపించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్‌కు ఆర్థికంగా సహాయం చేయడానికే ఈ వసూళ్లకు పాల్పడుతోందని కేటీఆర్ అన్నారు. ఈ మేరకు శనివారం ఎక్స్(ట్విట్టర్)లో పలు ఆరోపణలు చేశారు.
కర్ణాటకలో అన్న భాగ్య స్కీమ్ కోసం తెలంగాణ బియ్యం..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు కర్ణాటకలో పండుతున్న వరి ఎంతో కనీస అవగాహన లేకుండా అన్న భాగ్య స్కీమ్ హామీ ఇచ్చింది.
ఆ పథకం అమలు చేయడానికి 2 నెలలుగా తెలంగాణ వంటి పక్క రాష్ట్రాలను సహాయం కోరుతూ వచ్చింది. చివరగా బియ్యం ఇవ్వడానికి తెలంగాణ, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలు ముందుకు వచ్చాయి.