బస్ టికెట్ కి డబ్బులు నేనివ్వను సీఎంనే ఇస్తారు అడుక్కోపొండి.. కర్ణాటకలో మహిళా ప్రయాణికురాలు..

కర్ణాటక ప్రభుత్వానికి అనుకోకుండా కొత్త షాక్..

గెలిచిన తర్వాత తన మొదటి సంతకం మహిళలకు ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం అంటూ కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వడంతో కర్ణాటక మహిళలు కాంగ్రెస్ పార్టీకి పట్టం… అయితే ఇది అమల్లో కొద్దిగా సమయం పట్టడంతో ఆర్టీసీ బస్సులో ఓ మహిళ ప్రయాణిస్తుండగా కండక్టర్ ఆమెను టికెట్ అడగడం జరిగింది, నేను టికెట్ కి డబ్బులు ఇవ్వను సీఎంనే అడుక్కోపో అంటూ కండక్టర్ కి షాక్ ఇచ్చింది.. ఇంకా అది అమలు కాలేదమ్మా అమలు అయినప్పుడు ఫ్రీగా ప్రయాణించవచ్చు.. ముందు టికెట్ తీసుకోవాలంటు కండక్టర్ ఎంత అడిగినా టికెట్ తీసుకునే సమస్య లేదంటూ మొండి కేసు కూర్చుంది.. ఇదే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతుంది..

కరెంటు బిల్లులు అడగటానికి వెళ్లిన అధికారులకు కూడా ఇలాంటి షాక్ లే ఎదురు అవుతున్నాయి… మొత్తానికి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఎందుకు కడతామంటూ అక్కడ ప్రజలు నిలదీస్తున్నారు.. వెయిట్ చూడాలి ఇలాంటి షాక్ లకు ఇంకా ఎన్ని చూడలిసి వస్తోంది అని అక్కడ రాజకీయ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు…