కర్ణాటక లో మొన్న జరిగిన ఎన్నికల్లో ఉచితాలు పెట్టీ ఆచరణలో అమలు చేయడం లేదు…కర్ణాటక ఎమ్మెల్సీ రవికుమార్…

సూర్యాపేట జిల్లా..
నేరేడుచర్ల..

కాంగ్రెస్, బిఆర్ఎస్ లను ఒడించాలి…బిజెపి ని గెలిపించాలి, కార్యకర్తలు కష్టపడి పని చేస్తే జయం మనదే… కర్ణాటక ఎమ్మెల్సీ రవికుమార్..
….. మాట్లాడుతూ….

– నేరేడుచర్ల మండల కేంద్రంలో నేరేడుచర్ల, పాలకీడు, గరిడేపల్లి మండలాల మండల అధ్యక్షులు,బూత్ కమిటీ అధ్యక్షుల సమావేశం నిర్వహించారు.
– తెలంగాణా లో హాంగ్ వస్తే బిజెపి అధికారం చేపడుతుందని అన్నారు.
– దక్షిణ భారత దేశంలో కూడా బిజెపి బలంగా ఉందని తెలిపారు.
– బిజెపి పాలిత రాష్ట్రాల్లో అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి.
– దక్షిణ భారతంలో ప్రాంతీయ పార్టీలు డబ్బు రాజకీయాలతో వ్యవస్థలను బ్రష్టు పట్టిస్తున్నాయి.
– అధికారం కోసం ఉచిత పథకాలను ప్రకటిస్తారు.
సాధ్య అసాధ్యాలు కూడా ఆలోచించరు .రాష్ట్రంలో ఉండే ఆదాయం కన్న ఎక్కువ ఉచితాలు ప్రకటన చేస్తాయి.
– కర్ణాటక లో మొన్న జరిగిన ఎన్నికల్లో ఉచితాలు పెట్టీ ఆచరణలో అమలు చేయడం లేదు.
– తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో 14వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉంటే.. ఈ పది సంవత్సరాల కాలంలో మన మిగులు బడ్జెట్ 30 వేలకోట్లు ఉండాల్సిన మిగులు బడ్జెట్ ఉండాల్సిన దాన్ని…5లక్షల కోట్ల అప్పులు చేసి కూర్చున్నారు కెసీఆర్.
– దేశంలో మోడీ ప్రభుత్వం 7లక్షల కోట్ల ఉన్న ఇందన అప్పులను తీర్చి, 9 సంవత్సరాలకు ఇందనం ఎగుమతి చేయడానికి మిగులు డబ్బులు సమకూర్చిన చరిత్ర ఉంది.
– తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు బ్రష్టు పట్టిస్తున్నారు.
– జాతీయ రహదారులు,గ్రామాల్లో రోడ్లు, సిమెంట్ రోడ్లు కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టడం జరిగింది .
– కేంద్రం ప్రతి గ్రామ పంచాయతీకి నేరుగా నిధులు పంపిస్తుంది.
– కేంద్రం ఇంటి నిర్మాణానికి రూ.3లక్షల 60 వేలు ఇస్తుంది.రాష్ట్ర 3లక్షల 40 వేలు కలిపి ప్రతి పేద వారికి 7 లక్షలు ఇవ్వాలి .కానీ కెసీఆర్ డబుల్ బెడ్ రూం ఇండ్లను నాశనం చేశారు.
– రాష్ట్రంలో ప్రధాన మంత్రి అవాస్ యోజన పథకం అమలు చేయడం లేదు.
– అబద్ధపు,దొంగ వాగ్దానాలతో ప్రజలను కేసిఆర్ మోసం చేస్తున్నారు.
– అందుకే ఈ ఎన్నికల్లో కెసీఆర్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలి.
– తెలంగాణలో బిజెపి 20 సీట్లు గెలిచిన అధికారం బిజెపి చేపడుతుంది.
– హుజుర్ నగర్ లో బిజెపి అభ్యర్ధి గెలుపు కోసం కార్యకర్తలు పని చేయాలి.

చల్ల శ్రీలత… కామెంట్స్….
బిజేపి ఎమ్మెల్యే అభ్యర్థి చల్ల శ్రీలత మాట్లాడారు.

– రాజకీయాల్లోకి డబ్బు సంపాదనకు రాలేదు.ప్రజలకు చేతనైన మేరకు సహాయం చేయాలని వచ్చాను.
– ప్రతి గుండెకు అండగా ఉంటాను. ఆపద వస్తే ఆదుకుంటాను.
– హుజూర్ నగర్ నియోజవర్గంలో బిజెపి బలంగానే ఉంది.
– సర్వేల్లో 21శాతం బిజెపి ఓటు బ్యాంక్ ఉందని వస్తున్నాయి.
– ఓటు బ్యాంక్ 40శాతానికి పెంచుకుంటే విజయం మనదే.
– గ్రామాల్లోని కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి మోడీ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించాలి.
– ఓటు బ్యాంక్ పెంచేలా ఈ 20 రోజులు ప్రతి కార్యకర్త పని చేయాలి.
– ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాను.ఎవరు భయపడాల్సిన పని లేదు .
– మనం గెలిస్తే మోడీ సహకారంతో నియోజకవర్గ రూపు రేఖలు మారేలా అభివృద్ధి చేస్తాను..
ఈ సమావేశంలో హుజూర్ నగర్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీలత, పార్టీ ఎన్నికల ఇంచార్జీ .వి.రమేష్, బిజెపి జిల్లా అధ్యక్షులు బొబ్బా భాగ్యరెడ్డి, ఓబిసి మోర్చా జిల్లా అధ్యక్షులు అంబాల నరేష్, బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు పోకల వెంకటేశ్వర్లు, నేరేడుచర్ల, గరిడేపల్లి, పాలకీడు మండలాల అధ్యక్షులు విజయ్ కుమార్, నర్సింగ్ అంజయ్య, గుండ్రెడ్డి విజయభాస్కర్ రెడ్డి, నేరేడుచర్ల అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కొణతం నాగిరెడ్డి, నాయకులు హరీష్, తదితరులు పాల్గొన్నారు.