కర్ణాటక రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ లను నిన్న డిల్లీకి పిలిపించిన అధిష్టానం రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై చర్చించింది..
పార్టీ పెద్దలు రాజకీయంగా ఎలాంటి ప్రాధాన్యత లేదని.. రాజ్యసభ స్థానాలు ఇతర పాలనాపరమైన అంశాలపైనే చర్చించామని.. బయటకు చెబుతున్నప్పటికీ.. ముఖ్యమంత్రి మార్పు పైనే ప్రధాన చర్చ జరిగినట్లు స్పష్టంగా తెలుస్తోంది..
పార్టీ ముఖ్యులు రాహుల్ గాంధీ ఇద్దరు నేతలతో వేరువేరుగా.. వన్ టూ వన్ భేటీ అయ్యారు.. అంతకుముందు సిద్ధరామయ్య, డీజీఎస్ కూడా ప్రత్యేకంగా సమావేశమయ్యారు..
నిజంగానే రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక ఇతర అంశాల గురించే అయితే ఇంతలా వరుస భేటీలు హడావుడి ఎందుకు ఉంటుందని పొలిటికల్ సర్కిల్ లో రోజంతా చర్చ జరిగింది..
మొత్తంగా చూస్తే విశ్వసనీయ సమాచారం ప్రకారం సిద్ధరామయ్యను కేంద్ర రాజకీయాల్లోకి రప్పించి.. రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవిని శివకుమార్ కు ఇవ్వాలని పార్టీ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది..
నిజానికి పార్టీ అధికారంలోకి వచ్చిన సందర్భంలోనే ఇద్దరి నేతల మధ్య అధిష్టానం ఒక ఒప్పందాన్ని కుదిర్చింది..
రెండున్నరేళ్లుపాటు సిద్ధరామయ్య.. తర్వాత డీకెఎస్ సీఎం పదవిలో ఉండేలా ఇరువురు నేతల మధ్య సయోధ్య కుదిర్చింది..
అయితే గతేడాది చివరి లోనే సిద్ధరామయ్య గడువు ముగిసింది.. అయితే తనకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా అధిష్టానం సిద్ధరామయ్యను కొనసాగించడంపై డీకెఎస్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు..
అయితే తాను బాహాటంగా ఏం మాట్లాడినా.. పార్టీ వ్యతిరేకంగా ఎలాంటి వైఖరి తీసుకున్నా.. అది అంతిమంగా సిద్ధరామయ్యకే లాభం చేకూరుస్తుందని భావించిన డీకెఎస్.. ఓపికగా తన ప్రయత్నాలు తాను చేస్తూనే.. పాలనా పరంగా పార్టీ పరంగా ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త వహిస్తూ వస్తున్నారు..
ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిశాక మరోసారి సీఎం మార్పు విషయంపై చర్చిద్దామని గతంలోనే అధిష్టానం నిర్ణయం తీసుకుంది..
ఈ నేపథ్యంలో ఈసారి పదవీ మార్పు తథ్యమని.. సీఎం కావాలన్న డీకెఎస్ కల నెరవేరబోతుందనే టాక్ వినిపిస్తోంది..
మరోవైపు..రేపు ఉదయం బెంగళూరులో ఇద్దరు నేతల బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ ఉంది.. ఈ మీటింగ్ తర్వాత మరింత స్పష్టత వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది..