రాజీనామా ప్రకటించిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య.

రాజీనామా ప్రకటించిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య

*🔹బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ తర్వాత సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా.*

_• మధ్యాహ్నం 3 గంటల తర్వాత రాజీనామాను సమర్పించనున్న సిద్ధరామయ్య._

కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తన నివాసంలో జరిగిన అల్పాహార విందు భేటీలో హైకమాండ్ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తన క్యాబినెట్ మంత్రులకు వివరించారు. అనంతరం ప్రస్తుత మంత్రివర్గాన్ని రద్దు చేస్తున్నట్లు కూడా ఆయన ప్రకటించారు.

ఉపముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ సహా పలువురు మంత్రులు హాజరైన ఈ సమావేశంలో సిద్ధరామయ్య కాళ్లకు శివకుమార్ నమస్కరించడం విశేషం. కాంగ్రెస్ అధిష్టానం, ముఖ్యంగా రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు సిద్ధరామయ్య ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2023 ఎన్నికల విజయం తర్వాత కుదిరిన రెండున్నరేళ్ల రొటేషన్ ముఖ్యమంత్రి ఒప్పందంలో భాగంగానే ఈ మార్పు జరుగుతోందని సమాచారం. కొత్త ముఖ్యమంత్రిగా డి.కె. శివకుమార్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.