అబద్దాల హామీలతో కర్ణాటక,తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది..మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్.

BRS పార్టి మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టారు. నిన్న రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పై చేసిన వ్యాఖ్యలని ఖండించారు. ‘తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పును బిఆర్ఎస్ గౌరవించింది..కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చేదాకా మా బాధ్యతను గుర్తు చేస్తామని కేటీఆర్ చెప్పారు. తెలంగాణలో అసలు అభివృద్ధి జరగనట్లుగా ప్రజలను మోసం చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై కాంగ్రెస్ దృష్టి సారించాలి. కాంగ్రెస్ నేతలు కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ లపై కాంగ్రెస్ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నిన్న చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నారన్న సోయి లేకుండా మాట్లాడుతున్నారు.

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి అరువు తెచ్చుకున్న నాయకుడు. కాంగ్రెస్ కేవలం రెండు రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో వుంది. అబద్దాల హామీలతో కర్ణాటక,తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దేశంలో అధికారంలోని రాష్ట్రాల్లో కాంగ్రెస్ చచ్చిపోయిందా. కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ గవర్నమెంట్ గా పేరు తెచ్చుకున్నారు. డిసెంబర్ 9 న రైతురుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పలేదా. వరి పంటకు క్వింటాల్ కు 500 రూపాయల బోనస్ ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం పాతర పెట్టింది. గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే ఇస్తామన్నారు. ప్రజలు ఓట్లు వేస్తే…హామీలు నెరవేర్చకుండా కాంగ్రెస్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది. బిల్లా,రంగాలు అంటూ రేవంత్ రెడ్డి దిగజారి మాట్లాడుతున్నారు’ అని అన్నారు BRS నాయకులు కర్నె ప్రభాకర్..