కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..!

పేద ప్రజలకు రేషన్ కార్డు ఎంత ముఖ్యమైనదో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. తాజాగా పేద ప్రజలకు జారిచేసిన రేషన్ కార్డులకు సంబంధించి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టీవీ, ఫ్రిజ్, బైక్ ఉన్నవారు.. స్వచ్ఛందంగా రేషన్ కార్డును వదులుకోవాలని ప్రజలను కోరింది. కడు పేద ప్రజలకే రేషన్ లభించాలని.. అలాంటి వారికి లబ్ది చేకూర్చడం కోసమే ప్రభుత్వం పేద ప్రజలకు రేషన్ ఏర్పాటు చేస్తుందని కర్ణాటక ప్రభుత్వం అంటుంది. టీవీ, ఫ్రిజ్, బైక్ ఉన్న వారు కనీసం సంపాదన హెచ్చుగానే ఉంటుందని అంటుంది. ఆ వస్తువులు కలిగి ఉన్నవారు మార్చి 31 లోపు రేషన్ కార్డులను ప్రభుత్వానికి అప్పజెప్పాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉమేశ్ కత్తి అన్నారు. లేకుంటే చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బీపీఎల్ రేషన్ కార్డు తీసుకునేవారికి ఐదెకరాల కంటే ఎక్కువ భూమి ఉండకూడదు. టీవీ, ఫ్రిజ్‌, బైక్ వంటి వస్తువులు ఉండకూడదు. ఏడాదికి రూ. 1.20 లక్షల కన్నా ఆదాయం కలిగి ఉన్నవారు ఈ రేషన్ కార్డులు వినియోగించకూడదు. అంతకు మించి ఆదాయం ఉన్నా.. టీవీ, ఫ్రిజ్, బైక్ ఉన్నా మార్చి 31 లోపు రేషన్ కార్డులను సరెండర్ చేయాలి అని అన్నారు.