పెళ్లయిన మూడు రోజులకే ప్రేమించిన వ్యక్తితో జంప్ ఆయిన వధువు..!!

పెళ్లయిన మూడో రోజే ప్రియుడితో వెళ్లిపోయిన వధువు.
కర్నూలు జిల్లాలో ఓ నవ వధువు చేసిన పని ఓ ఇల్లు కాలబెట్టే వరకూ వెళ్లింది. పెళ్లి జరిగిన మూడు రోజులకే అంతకుముందు ప్రేమించిన వ్యక్తితో యువతి వెళ్లిపోయింది. ఇదే వివాదానికి దారి తీసి ఇంటికి నిప్పంటించే వరకూ వెళ్లింది…

పెళ్లయిన మూడు రోజులకే ప్రేమించిన వ్యక్తితో వధువు వెళ్లి పోవడం చాలా పరువు పోయింది అని… దీంతో ఆగ్రహించిన కుటుంబీకులు యువతి ప్రేమికుడి ఇంటికి నిప్పుపెట్టారు.
ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరంలో ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది. జూన్ 9న ఓ గ్రామానికి చెందిన యువకుడితో యువతికి వివాహం జరిగింది. అయితే అంతకుముందే ఆమె మాధవరానికి చెందిన శివాజీని ప్రేమించింది. పెళ్లయిన మూడో రోజున శివాజీ… ఆమెను తీసుకుని వెళ్లిపోయాడు.