కర్నూలు జిల్లాలో వింత ఆచారం..

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో వింత ఆచారం వుంది. అక్కడ కాలితో తంతే కష్టాలు వుండవట. సమస్యలు ఎన్నైనా పరిష్కారం ఒక్కటే. అదే ఒకే ఒక్క కాలి దెబ్బకి కష్టాలు మాయం అవుతాయి..
ప‌త్తికొండ మండ‌లం పెద్ద‌హుల్తి గ్రామంలో ప్ర‌తిఏటా దీపావ‌ళి మ‌రుస‌టి రోజు ఆ వింత ఆచారం జ‌రుపుకుంటారు. ఈ వేడుక‌ల‌లో ఆ గ్రామంలో కొలువైన హుల్తీ లింగేశ్వ‌ర‌స్వామిని ఘ‌నంగా ఊరేగింపు నిర్వ‌హిస్తారు. ఈ స‌మ‌యంలోనే భ‌క్తులంద‌రూ ఒక్క‌సారిగా నేల‌పై బొక్క‌బోర్ల ప‌డుకుంటారు. స్వామివారిని మోసేవారు వీరి త‌ల‌ను కాలుతో తన్నుకుంటూ ముందుకు వెళ్తారు. ఇలా త‌న్నించుకోవ‌డానికి స్థానికుల‌తో పాటు చుట్టుప‌క్క‌ల గ్రామ‌స్తులు కూడ బారులు తీరుతుంటారు. త‌న్నించుకోవ‌డం ద్వారా స్వామివారు త‌మ కోరిక‌లు నెర‌వేర్చుతాడ‌ని అక్క‌డి ప్ర‌జ‌ల న‌మ్మ‌కం…