కార్తికేయ 2 రివ్యూ …

Karthikeya 2 Review..

నటీనటులు : నిఖిల్ , అనుపమ పరమేశ్వరన్

సంగీతం : కాలభైరవ

నిర్మాతలు : టీజీ విశ్వప్రసాద్ , అభిషేక్ అగర్వాల్

దర్శకత్వం : చందూ మొండేటి..

కొన్నేళ్ల క్రితం వచ్చిన సూపర్ హిట్ సినిమా టైటిల్ కు రెండు నెంబర్ జోడించి ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలనుకున్న ఎందరో హీరోలు దర్శకులు బాక్సాఫీస్ వద్ద షాకులు తిన్న సందర్భాలు చాలా ఉన్నాయి..2014లో విడుదలై.. మంచి విజయం సొంతం చేసుకున్న “కార్తికేయ” చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిన చిత్రం “కార్తికేయ 2”. నిఖిల్-చందు మొండేటిల కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ మిస్టరీ థ్రిల్లర్ పై మంచి అంచనాలున్నాయి…

కథ

దేవుడి మీద నమ్మకాల కంటే సైన్స్ ని ఎక్కువగా నమ్మే డాక్టర్ కార్తికేయ(నిఖిల్ సిద్దార్థ్)కు అనుకోకుండా ఓ ప్రమాదం తప్పుతుంది. దీంతో తల్లి మాట కాదనలేక శ్రీకృష్ణుడి దర్శనం కోసం ద్వారకా బయలుదేరతాడు. అయితే ఊహించని విధంగా కార్తికేయను అనూహ్యమైన పరిస్థితుల మధ్య పోలీసులు అరెస్ట్ చేస్తారు. తనను తప్పించిన అమ్మాయి(అనుపమ పరమేశ్వరన్)వల్ల దేశానికో గొప్ప ప్రయోజనం కలిగించే ఓ పెద్ద బాధ్యత తన మీద ఉందని గుర్తిస్తాడు. కృష్ణభగవానుడి ఆభరణం కోసం వేట మొదలుపెడతాడు. వీళ్ళ వెనుకే డాక్టర్ శంతను(ఆదిత్య మీనన్)ముఠా ఉంటుంది. మరి కార్తికేయ తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడనేదే అసలు స్టోరీ శ్రీకృష్ణుడి నగరానికి కార్తికేయను తీసుకు వెళుతుంది. అక్కడ ఫేమస్ ఆర్కియాలజిస్ట్ రావు మరణిస్తాడు. అతడిని కార్తికేయ హత్య చేశాడని పోలీసులు అరెస్ట్ చేస్తారు. స్టేషన్ నుంచి అతడిని రావు మనవరాలు ముగ్ధ (అనుపమా పరమేశ్వరన్) తప్పిస్తుంది. ఎందుకు? కార్తికేయతో ముగ్ధ ఏం చెప్పింది? ఆ తర్వాత శ్రీకృష్ణుడి కంకణం సాధించాలని ఎందుకు బలంగా నిర్ణయించుకున్నాడు? ఈ అన్వేషణలో శాంతను (ఆదిత్యా మీనన్), ఇంకా అధీర తెగ నుంచి కార్తికేయకు ఎటువంటి ప్రమాదాలు ఎదురయ్యయాయి? చివరకు, ఏమైంది? ఆ కృష్ణుడి కంకణం ప్రత్యేకత ఏమిటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి…

కార్తికేయ 2’కు అసలైన బలం దర్శకుడు చందూ మొండేటి కథను చెప్పిన విధానం. ప్రారంభం నుంచి ముగింపు వరకూ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ మైంటైన్ చేశాడు. అయితే… అధీరాలు, విలన్ శాంతను నుంచి హీరోకు బలమైన ఆటంకాలు ఏవీ ఎదురు కాలేదు. హీరో తప్పించుకోలేడని అనుకున్న ప్రతిసారీ… ఆయా సన్నివేశాలను హడావిడిగా, చప్పగా ముగించారు. హీరోకి ఎదురు లేకపోవడంతో కొన్ని సీన్స్‌లో థ్రిల్, వావ్ మూమెంట్స్ మిస్ అయ్యాయి. కొన్ని సన్నివేశాల్లో మణి బాబు మాటలు బావున్నాయి. ‘కార్తికేయ 2’లో దర్శకుడు చందూ మొండేటి హిందుత్వ స్టాండ్ తీసుకున్నారేమో అనిపిస్తుంది. పతాక సన్నివేశాల్లో సైన్స్ గురించి వివరించినప్పటికీ… కృష్ణుడిపై అభిమానం సినిమా అంతటా కనిపిస్తుంది. హీరో క్యారెక్టరైజేషన్‌లో బలం తగ్గింది. అధీరాలు, విలన్ విషయంలో క్లారిటీ మిస్ అయ్యింది. లూప్ హోల్స్ లేకుండా ఇంకా బాగా ఎగ్జిక్యూట్ చేసుంటే… సినిమా రిజల్ట్ మరో రేంజ్ లో ఉండేది.