కార్తిక మాసం మొదటి సోమవారం సందర్భంగా, నాగుల చవితి ఒకే రోజున రావడంతో భక్తులు శైవ క్షేత్రాలలో పోటెత్తిన భక్తజనం..

కార్తిక మాసం మొదటి సోమవారం సందర్భంగా, నాగుల చవితి ఒకే రోజున రావడంతో భక్తులు శైవ క్షేత్రాలలో పోటెత్తిన భక్తజనం…
తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. నాగులచవితి కూడా కావడంతో మహిళలు పోటెత్తారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గోదావరి నదీ తీరం భక్త జనో సందోహంతో నిండిపోయింది…తెల్లవారుజామున మూడు గంటల నుండి గోదావరి నది తీరాన భక్తులు స్నానం ఆచరించి శివాలయాలకు క్యూ కడుతున్నారు. ఆలయాల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆలయాల్లో వేకువజాము నుంచే భక్తులు ప్రత్యేక పూజలు,అభిషేకాలు చేస్తున్నారు. ముఖ్యంగా పంచారామ క్షేత్రాలైన పాలకొల్లు శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి, భీమవరం శ్రీ భీమేశ్వరాలయం భక్తులతో పోటెత్తాయి.