రేపటి నుంచి కార్తీక మాస పూజలు ప్రారంభం…

R9TELUGUNEWS.COM.
కార్తీక మాసం శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో జోగులాంబ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఈవో వీరేషం తెలిపారు. ఈ నెల 5 నుంచి వచ్చే నెల 4 వరకు ఆలయాల్లో ఆర్జిత సేవలు, ప్రాతః కాల మహా మంగళహరతి సమయం మార్పిడి చేస్తున్నట్లు చెప్పారు. ప్రాతః కాల మహా మంగళ హారతి ప్రతి ఆదివారం, సోమవారం, ఏకాదశి, పౌర్ణమి, అమావాస్య రోజుల్లో తెల్లవారుజామున 4.45 గంటలకు, మిగతా రోజుల్లో యాధావిధిగా ఉదయం 6 గంటలకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అభిషేకం, ఇతర సేవల సమయాలు ప్రతి ఆదివారం, సోమవారం, ఏకాదశి, పౌర్ణమి, అమావాస్య రోజుల్లో ఉదయం 5 గంటలకు, మిగతా రోజుల్లో ఉదయం 6 గంటలకు ప్రారంభమవుతాయన్నారు. ఈ నేపథ్యంలో భక్తులు ఈ సమయ మార్పులను గమనించి దేవస్థానానికి సహకరించాలని ఆయన కోరారు.