జీ20 సదస్సే లక్ష్యంగా దాడి..? భారీ ఆపరేషన్‌ చేపట్టిన సైన్యం..!

కాశ్మీర్.. భారత్‌-పాక్‌ సంబంధాలు మరింత లోతుకు దిగజార్చే ఘటన చోటు చేసుకొంది.

కేంద్రంగా పనిచేసే జైషే మహమ్మద్‌(JEM) ముసుగు సంస్థ పీపుల్స్‌ యాంటీ ఫాసిస్టు ఫోర్స్‌ (పీఏఎఫ్‌ఎఫ్‌)..

భారత సైనిక వాహనంపై దాడి బాధ్యతను స్వీకరించింది. జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్‌-370ని తొలగించిన తర్వాత.. అక్కడి పరిస్థితి గణనీయంగా మెరుగుపడిందని ప్రపంచానికి చాటేందుకు శ్రీనగర్‌లో జీ-20(g20) సదస్సు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది పాక్‌కు ఏమాత్రం మింగుడుపడలేదు. మరోవైపు పాక్‌ విదేశాంగ మంత్రి బిలావల్‌ భుట్టో జర్దారీ మే 5న భారత్‌లోని గోవాలో జరగనున్న షాంఘై కోఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ సదస్సుకు హాజరు కానున్నట్లు ప్రకటించారు. ఈ సమయంలో భారత్‌-పాక్‌ మధ్య ద్వైపాక్షిక సమావేశం జరిగే అవకాశం కూడా ఉంది. దౌత్యపరంగా ఇంత కీలక సమయంలో భారత సైనిక వాహనంపై ముష్కరులు దాడికి తెగబడటం సంచలనంగా మారింది..