భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌కు, ఉగ్ర‌వాదుల‌కు మ‌ధ్య ఎదురుకాల్పులు..ఈ కాల్పుల్లో ఆర్మీ అధికారితో పాటు ఓ సైనికుడు ప్రాణాలు కోల్పోయారు.

ఎన్నాళ్ళు ప్రశాంతంగా ఉన్న మళ్లీ తీవ్రవాదులు అలజడి సృష్టిస్తున్నారు.. గత మూడు నాలుగు రోజుల నుండి నిరంతరం ఉగ్రం ఒక ఆర్మీ జవాన్లకు జరుపుతూనే ఉన్నట్లు సమాచారం…

ఘాటుగా స్పందించిన అమిత్ షా స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది మరియు సర్జికల్ స్ట్రైక్ జరుగుతాయని పాకిస్తాన్ హెచ్చరించారు….

జ‌మ్మూక‌శ్మీర్ ఫూంచ్ జిల్లాలో గురువారం జ‌రిగిన కౌంట‌ర్ టెర్ర‌ర్ ఆప‌రేష‌న్ చ‌ర్య‌ల్లో భాగంగా, భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌కు, ఉగ్ర‌వాదుల‌కు మ‌ధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఆర్మీ అధికారితో పాటు ఓ సైనికుడు ప్రాణాలు కోల్పోయారు.గ‌త నాలుగు రోజుల క్రితం ఉగ్ర‌వాదులు జ‌రిపిన కాల్పుల్లో ఐదుగురు సైనికులు వీర‌మ‌ర‌ణం పొందిన విష‌యం తెలిసిందే. నాటి నుంచి ఆ ఉగ్ర‌వాదుల‌ను మ‌ట్టుబెట్టేందుకు బ‌ల‌గాలు కూంబింగ్ కొన‌సాగిస్తున్నాయి. ఈ క్ర‌మంలో బుధ‌వారం సాయంత్రం ఫూంచ్ – రాజౌరీ ర‌హ‌దారిని మూసేశారు. ఆ మార్గంలో ఉన్న ద‌ట్ట‌మైన అడ‌వుల్లో ఉగ్ర‌వాదులు త‌ల‌దాచుకున్నారు…