కశ్మీరీ పండిట్ టీచర్ పై ముష్కరులు కాల్పులు….

జమ్ముకశ్మీర్‌లో మహిళలపై ఉగ్రవాదుల దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కుల్గాంలోని గోపాల్​పురలో ఓ కశ్మీరీ పండిట్ టీచర్​పై ముష్కరులు కాల్పులుకు తెగబెడ్డారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన ఆమెను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఉపాధ్యాయురాలు కశ్మీర్​లోని సాంబలో నివాసముంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు. స్కూల్​లో పాఠాలు బోధించేందుకు గోపాల్​పుర వెళ్లినప్పుడు ఉగ్రవాదులు దాడి చేసినట్లు పేర్కొన్నారు…ఘటన అనంతరం ఆ ప్రాంతంలో నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. నిందితులకు కచ్చితంగా పట్టుకుంటామన్నారు. ఇటీవలే జమ్ముకశ్మీర్‌లో టీవీ నటిని కాల్చిచంపారు ముష్కరులు. ఇప్పుడు మరో మహిళపై దాడి చేయడం స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తోంది….