కడియం శ్రీహరికి కరెక్టేనా వ్యక్తి అతనే.. సీఎం కేసీఆర్ మధ్యలో ఉన్న నాయకుడు ఎవ్వరూ..!?

ఈ కీలక నేతలందరూ గులాబీ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు పదవులను అనుభవించారు. కానీ అధికారం పోగానే మూడు నెలలు కూడా గులాబీ పార్టీలో లేకుండా కండువా మార్చేశారు. అయితే తాజాగా కడియం శ్రీహరి కుటుంబం మాత్రం కేసిఆర్ కు ఊహించని షాక్ ఇచ్చింది. వరంగల్ ఎంపీ టికెట్ కడియం శ్రీహరి కూతురు కావ్య కు కేసిఆర్ ఇచ్చారు. ఆ టికెట్ కాదని… కడియం శ్రీహరి మరియు ఆయన కూతురు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. గులాబీ పార్టీ పై విమర్శలు చేసి మరి అందులో చేరుతున్నారు.

అయితే కడియం శ్రీహరి చేసిన నమ్మక ద్రోహానికి అదే స్థాయిలో దెబ్బకొట్టేందుకు కల్వకుంట్ల చంద్రశేఖర రావు కొత్త వ్యూహాన్ని అమలు పరచనున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత వరంగల్ ఎంపీగా కడియం శ్రీహరి పోటీ చేస్తారని సమాచారం అందుతోంది. అయితే కడియం శ్రీహరిని ఓడించేందుకు మళ్లీ తాటికొండ రాజయ్యను బరిలోకి దింపనున్నారట కల్వకుంట్ల చంద్రశేఖర రావు. ఇటీవల గులాబీ పార్టీకి తాటికొండ రాజయ్య రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే కడియం ఎపిసోడ్ అనంతరం… తిరిగి సొంతగూటికి రావాలని తాటికొండ రాజయ్య అనుకుంటున్నారట…మేరకు తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తో తాటికొండ రాజయ్య చర్చలు చేస్తున్నారట. వరంగల్ ఎంపీగా దళితుడైన తాటికొండ రాజయ్య బాగా సెట్ అవుతాడని కేసీఆర్ కూడా అనుకుంటున్నారట. ముల్లును ముల్లుతోనే తీయాలన్న సామెతతో కడియం శ్రీహరిని దెబ్బ కొట్టేందుకు దళితుడైన తాటికొండ రాజయ్యను బరిలోకి దింపేందుకు సిద్ధమయ్యారట కేసీఆర్. ప్రస్తుత పరిస్థితిలలో కాంగ్రెస్ పార్టీ మరియు బిజెపి పార్టీకి ఓటేసే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో లేదు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే గులాబీ పార్టీ కచ్చితంగా ఉండాలని ప్రజలు ద్రుడ నిశ్చయంతో ఉన్నారు. అందుకే గులాబీ పార్టీలో ఎలాంటి లీడర్ నిలబడ్డ అతనికి ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని కెసిఆర్ ఆశ భావం వ్యక్తం చేస్తున్నారు..