బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు కేసీఆర్. అరగంట ముందే అసంబ్లీకి రావాలని ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీ చేశారు కేసీఆర్..
తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ఎల్పీ సమావేశం ముగిసింది. పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పీ సమావేశం మూడు గంటలకు పైగా కొనసాగింది. ఈ సందర్భంగా బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. అందరం కలిసి ప్రజా సమస్యల పరిష్కారం కృషి చేద్దామని కేసీఆర్ సూచించారు. అసెంబ్లీ సమావేశాలకు నేను కూడా వస్తున్నానని పార్టీ ప్రతినిధులతో కేసీఆర్ అన్నారు. రేపట్నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి..
కేసిఆర్ ఆదేశాలు…
9 గంటల 30నిమిషాలకే అసెంబ్లీలో ఉండాలని.. ప్రతిరోజూ తప్పకుండా అసెంబ్లీకి రావాలని అన్నారు కేసీఆర్. ఎల్పీలో సమావేశం పెట్టుకొని అసెంబ్లీలోకి వెళ్లాలని అన్నారు కేసీఆర్. అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడే అంశాలపై పూర్తిగా అధ్యయనం చేసి మాట్లాడాలని అన్నారు కేసీఆర్.
తెలంగాణ ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలని.. రాష్ట్ర ప్రభుత్వ అవినీతి పై, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై చీల్చి చెండాడాలని అన్నారు. బీఆర్ఎస్ మీద ప్రభుత్వం చేస్తున్న తప్పుడు నిందలను తిప్పి కొట్టాలని అన్నారు కేసీఆర్. రాష్ట్రంలో నెలకొన్న పలు సమస్యలు….ఎండిన పంటలు, అందని కరెంటు, అందని సాగునీరు, కాలిపోతున్న మోటర్లు తదితర రైతాంగ సమస్యలపై, మంచినీటి కొరత పై అసెంబ్లీలో మండలిలో పోరాడాలని అన్నారు కేసీఆర్.
బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ రిజర్వేషన్ల బిల్లుకు మద్దతుగా గొంతు వినిపించాలని.. రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు నిర్వీర్యమౌతున్న తీరుపై మాట్లాడాలని అన్నారు కేసీఆర్.ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్, డీఏల పెండింగు, పీఆర్సీ అమలు పై అసెంబ్లీ, మండలి వేదికగా ప్రభుత్వాన్ని నిలదీయాలని అన్నారు. దళిత బంధును నిలిపివేయడం పట్ల ప్రశ్నించాలని… గొర్రెల పెంపకం, చేపల పంపిణీ సమగ్ర అమలుపై అసెంబ్లీ, మండలిలో ప్రభుత్వాన్ని నిలదీయాలని అన్నారు కేసీఆర్..
ప్రజా సమస్యలపై పోరాడడానికి నేను వస్తాను..
కాంగ్రెస్ హాయంలో రైతులకు కన్నీరు పెడుతున్నారని, వారికి రైతు బంధు, సాగునీరు ఇవ్వకుండా ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ”అసెంబ్లీ సమావేశాలకు నేనూ హాజరవుతాను. ఉదయం 9:30 గంటలకల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి చేరుకోవాలి. అసెంబ్లీ లేవనెత్తాల్సిన అంశాలపై, అసెంబ్లీలో నడుచుకోవాల్సిన తీరుపై చర్చిద్దాం. ప్రతి ఎమ్మెల్యే ప్రతి రోజూ అసెంబ్లీకి రావాలి. సభలో మాట్లాడే ప్రతి అంశంపై నేతలు పూర్తి అవగామన పెంచుకోండి” అని దిశానిర్దేశం చేశారు కేసీఆర్.
”పార్టీ శాసన సభ, మండలి సభ్యులందరూ నిర్ణీత సమయానికి హాజరు కావాలి. తెలంగాణ ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వ అవినీతి పై, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై చీల్చి చెండాడాలి. బి ఆర్ ఎస్ మీద రాష్ర్ట ప్రభుత్వం చేస్తున్న తప్పుడు నిందలను తిప్పి కొట్టాలి. రాష్ర్టంలో నెలకొన్న పలు సమస్యలు.. ఎండిన పంటలు, అందని కరెంటు, అందని సాగునీరు, కాలిపోతున్న మోటర్లు తదితర రైతాంగ సమస్యలపై, మంచినీటి కొరత పై అసెంబ్లీ లో మండలి లో పోరాడాలి. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ రిజర్వేషన్ల బిల్లుకు మద్దతుగా గొంతు వినిపించాలి. రాష్ట్రం లో గురుకుల పాఠశాలలు నిర్వీర్యమౌతున్న తీరుపై మాట్లాడాలి. ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్… డి ఎ ల పెండింగు… పీఆర్సీ అమలు పై అసెంబ్లీ మండలి వేదికగా ప్రభుత్వాన్ని నిలదీయాలి” అని అన్నారు..