ఛాతిలో సెకండరీ ఇన్‌ఫెక్షన్ కారణంగా సీఎం కోలుకోవడానికి కాస్త సమయం పడుతుంది..!

కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఛాతిలో సెకండరీ ఇన్‌ఫెక్షన్ కారణంగా సీఎం కోలుకోవడానికి కాస్త సమయం పడుతుందని తెలిపారు.వైరల్ ఫీవర్ కారణంగా ఆయన కొద్దిరోజులుగా ప్రజలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సీఎం కేసీఆర్‌కు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రావడం వల్ల కోలుకోవడానికి అనుకున్న సమయం కంటే ఎక్కువ కాలం పట్టే అవకాశం ఉందని కేటీఆర్ చెప్పారు.

ఇక, సెప్టెంబర్ 18న వినాయక చవితి సందర్భంగా చివరిసారిగా ప్రజలకు కనిపించారు సీఎం కేసీఆర్. ఆ తర్వాత మళ్లీ ప్రజల మధ్యకు రాలేదు. దీంతో ఆయనకు ఏమైందన్న చర్చ జోరుగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాకు కేటీఆర్ వివరాలు అందజేశారు.