కంచర్ల కృష్ణారెడ్డి తో ప్రగతి భవన్ లొ సీఎం కేసీఆర్ సుదీర్ఘ చర్చలు… మునుగోడు తెరాస ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకటనపై చర్చ..!!!

BREAKING NEWS:-

వరుసగా 3వ సారి ప్రగతి భవన్ నుండి కంచర్ల కు పిలుపు… సుధీర్ఘంగా చర్చించినట్టు సమాచారం… మునుగోడు TRS అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి.?.. ప్రగతి భవన్ నుండి బయటకు వస్తుండగా కంచర్ల కృష్ణారెడ్డి మీడియా అడిగిన ఏ ప్రశ్నకు కూడా బదిలీకుండా వెళ్ళిపోయారు..

సీఎం కేసీఆర్ సభలో అభ్యర్థిని ప్రకటించే అవకాశం…

మునుగోడు ఉపఎన్నికపై ప్రధాన పార్టీలన్ని ఫోకస్‌ పెట్టాయి. కాంగ్రెస్‌, టీఆర్ఎస్ అభ్యర్థి ఎంపికపై కసరత్తు ముమ్మరం చేశాయి. టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఆ పార్టీ స్థానిక నేతలు కొందరు వ్యతిరేకిస్తున్నారు. శుక్రవారం కూసుకుంట్ల అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ ఏకంగా ఒక సమావేశం నిర్వహించారు… కూసుకుంట్లకు టికెట్ ఇస్తే సహకరించేది లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కంచర్ల కృష్ణారెడ్డికి సీఎం కేసీఆర్‌ నుంచి పిలుపు అందింది. సీఎం కేసీఆర్‌ పిలుపుతో హుటాహుటిన హైదరాబాద్ ప్రగతి భవన్ కి వెళ్ళిన కంచర్ల కృష్ణారెడ్డి…. సీఎం కేసీఆర్ తో వరుసగా 3వ సారి ప్రగతి భవన్ నుండి కంచర్ల కు పిలుపు వచ్చినట్లుగా తెలుస్తోంది… అందులో భాగంగానే ఆదివారం కూడా సుదీర్ఘంగా సీఎం కేసీఆర్ తో ప్రగతిభవన్లో చర్చించినట్లుగా టిఆర్ఎస్ పార్టీ వర్గాలు తెలిపాయి… ఈ చర్చలు మొదటగా మునుగోడు ఎమ్మెల్యే పోటీ పైనే జరిగిందంటూ ఆయన వర్గీల ప్రచారం జరుగుతోంది… ఏది ఏమైనా టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రేసులో కంచర్ల కృష్ణారెడ్డి పేరు బలంగా వినిపిస్తుంది..