దేశాన్ని మతం పేరుతో విడదీసే కుట్ర జరుగుతోందని కేసీఆర్ ఆరోపించారు…
నీచ రాజకీయాల కోసం విడదీసే ప్రయత్నం జరుగుతోంది..
‘ఆగస్టు 15 వేడుకలకు సంబంధించి హైటెక్స్ సభలో చెప్పాను. ఒక బంగ్లా కట్టాలంటే చాలా కష్టమైతది. కూలగొట్టాలంటే.. పది రోజులుపడుతుంది. కానీ, ఒక కూర్పు జరగాలంటే.. ఒక ఇల్లు నిలబెట్టాలంటే.. ఒక భవంతి నిర్మాణం కావాలంటే చాలా ప్రయాస పడాల్సి వస్తుంది. అలాంటి భారతదేశాన్ని మతం పేరు మీద, కులం పేరు మీద చాలా నీచమైన రాజకీయాల కోసం విడదీసే ప్రయత్నం జరుగుతుంది. ఇది ఏరకంగా మంచిది కాదు. ఏ పద్ధతుల్లో మంచిది కాదు. ఎంతో మంది పెద్దలు స్వతంత్ర పోరాట యోధులు త్యాగాలు చేసి, దశాబ్దాల పాటు జైళ్లలో ఉండి.. ఈ దేశాన్ని తెచ్చి మనకు ఇచ్చారు.ఈ స్వాతంత్య్రాన్ని మనం అనుభవిస్తున్నాం. ఈ స్వాతంత్య్ర పూర్తి ఫలాన్ని పూర్తిస్థాయిలో దేశం పొందాలంటే.. దేశంలో కులం, మతం, వర్గమని బేధం లేకుండా భారతీయత, భారతీయ ఐక్యత మనలో రావాలి. ఒకసారి దెబ్బతిన్నమంటే.. సమాజంలో విద్వేషం పెచ్చరిల్లిందంటే మళ్లీ ఏకం కావడం అంత సులభం కాదు. కాబట్టి వాటిన్నంటిని పక్కనబెట్టి.. ఏ విధంగా అయితే చైనా.. పురోగమించిందో, సింగపూర్ పురోగమించిందో.. కొరియాలాంటి దేశాలు పురోగమించాయో.. అదే బాటలో భారతీయులందరు కులమత రహితంగా బ్రహ్మండంగా ముందుకు సాగాలి’ అని సీఎం కేసీఆర్ అన్నారు…రాష్ట్రంలో 24 గంటల కరెంటు ఇస్తున్నామని, ఈ విషయం పదే పదే చెప్పడానికి కారణం ఉందన్నారు. హైదరాబాద్‌లో కరెంటు పోదు.. అదే దేశరాజధాని ఢిల్లీలో 24 గంటల కరెంటు రాదని వ్యాఖ్యానించారు. దేశంలో పరిస్థితి ఇలాగే ఉందని.. అందుకే ఈ విషయాన్ని పదే పదే చెబుతున్నానని అన్నారు.
ఒకప్పుడు మంచి నీళ్ల కోసం నానా తంటాలు పడేవాళ్లమని… ఇప్పుడు ఆ పరిస్థితి లేదని గుర్తు చేశారు. ఒకప్పుడు తెలంగాణ తలసరి ఆదాయం కేవలం రూ.లక్షగా ఉండేదని… ఇప్పుడు ఇండియాలో నెంబర్‌వన్‌గా రూ.2,78,500కు పెరిగిందని అన్నారు. ఈ విషయంలో మనకన్నా ముందుండే మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్‌లను దాటి ఈ ఘనత సాధించామని అన్నారు. తెలంగాణ ఇంత అభివృద్ధి చెందడం చూసి దేశమంతా ఆశ్చర్యపోతుందని కేసీఆర్ అన్నారు. చేనేత, గీత కార్మికులకు, బోదకాలు బాధితులకు ఇలా ఎంతోమందికి పెన్షన్లు ఇస్తున్నామని అన్నారు..