తొక్కి పడేస్తాం జాగ్రత్త.. ప్రతిపక్షాలకు కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్
హాలియా సభలో కేసీఆర్ ఫైర్
సభలో కేసీఆర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన వారిపై కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు.
మీలాంటి కుక్కలు చాలా ఉన్నాయి …వారిని తరిమేయండి .. పోలీసులు అరెస్ట్ చేయండి (సభలో కేసీఆర్ స్పీచ్ ను అడ్డుకునే వారిని ఉద్దేశించి)
పిచ్చిపనులు చేస్తే తొక్కి పడేస్తాం.
సహనానికి కూడా హద్దు ఉంటుంది.
కొత్త బిచ్చగాళ్ల లా కొద్దిమంది ప్రవర్తిస్తున్నారు.
మేము తలుచుకుంటే దుమ్ము దుమ్ము అయిపోతారు.
ఇక్కడ ఎవరు చేతులు ముడుచుకొని కూర్చోలేదు.
మీలాంటి వాళ్ళను చాలామందిని చూసాం.
రైతుబాట కార్యక్రమం ఎందుకు…రైతులు బాగున్నందుకా…మీ హయాంలో రైతులకు ఎరువులు కూడా ఇవ్వలేదు కాంగ్రెస్ నాయకులను ఉద్దేశించి.
పెద్ద పెద్ద డైలాగులు కాంగ్రెస్ నాయకులు చెబుతారు.. కానీ అభివృద్ధి ఏమీ చేయలేదు.
పిచ్చివాగుడు మానుకోవాలి అని బీజేపీ నాయకులకు చెబుతున్న
ప్రతిపక్షాలపై సీఎం కేసీఆర్ మండిపడ్డారు. బుధవారం నాటి హాలియా బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. కొందరు కాంగ్రెస్ నేతలు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. బీజేపీ నేతలు కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. వాళ్లలా మాట్లాడాలంటే తమకు చేతకాక కాదని, తాము తలుచుకుంటే కాంగ్రెస్ మిగలదన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఒళ్లు దగ్గరపెట్టుకోవాలని సూచించారు. హద్దు మీరినప్పుడు ఏం చేయాలో తమకు తెలుసన్నారు. తొక్కిపడేస్తాం జాగ్రత్త అని హెచ్చరించారు. తమకు ప్రజలు తీర్పు ఇచ్చారని.. ఢిల్లీ వాళ్లు చెబితే రాలేదన్నారు. కాంగ్రెస్‌కు తెలంగాణ పేరు పలికే అర్హత లేదన్నారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలకు కారణం ఎవరన్నారు. తెలంగాణలో ఈ దుస్థితికి కారణం కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని 3 ముక్కలు చేసిన పాపాత్ములు కాంగ్రెస్ నేతలు కాదా అన్నారు.
తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వనని కిరణ్‌కుమార్ అన్నాడు.. ఆనాడు ఒక్క కాంగ్రెస్ నేత అయినా మాట్లాడారా? కమీషన్ల కోసమే ప్రాజెక్ట్‌లు కట్టామని మాట్లాడుతున్నారు.. మీరు నాగార్జునసాగర్ కమీషన్ల కోసమే కట్టారా? నల్గొండ ఫ్లోరైడ్ సమస్య గురించి ఒక్కరైనా మాట్లాడారా? రైతుబంధు, రైతుబీమా వస్తుందన్నందుకు పోరుబాట చేస్తారా? కాంగ్రెస్ హయాంలో కనీసం ఎరువులు, విత్తనాలు ఇవ్వలేదు. విజయడెయిరీ మూసివేస్తే కాంగ్రెస్ నేతలు నోరు తెరవలేదు. దేశంలోనే అత్యధిక వడ్లు ఎఫ్‌సీఐకి ఇస్తున్న రాష్ట్రం మనది. కల్యాణలక్ష్మి ఏ రాష్ట్రంలోనైనా ఇస్తున్నారా? అని ఘాటు వ్యాఖ్యలు చేశారు