కేసీఆర్‌కు మ‌ద్ద‌తుగా క్రైస్త‌వ మ‌త పెద్ద‌ల ఏక‌గ్రీవ తీర్మానం..

*కేసీఆర్‌కు మ‌ద్ద‌తుగా క్రైస్త‌వ మ‌త పెద్ద‌ల ఏక‌గ్రీవ తీర్మానం*

జాతీయ పార్టీ ప్ర‌క‌టిస్తున్న సీఎం కేసీఆర్‌కు మ‌ద్ద‌తుగా నిజామాబాద్ సీఎస్ఐ చ‌ర్చిలో క్రైస్త‌వ మ‌త పెద్ద‌లు ఏక‌గ్రీవ తీర్మానం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ మేడే రాజీవ్ సాగ‌ర్ ఆధ్వ‌ర్యంలో బిష‌ప్ సాల్మ‌న్ రాయ్ మద్ధ‌తు ప్ర‌క‌టించారు.

ఈ సంద‌ర్భంగా సాల్మ‌న్ రాయ్ మాట్లాడుతూ.. కేసీఆర్ వెంటే తామంతా ఉంటామ‌ని స్ప‌ష్టం చేశారు. ఆ దేవుడి ఆశీస్సులు కేసీఆర్‌కు ఉండాల‌న్నారు. కేసీఆర్ లాంటి నాయ‌కులు ఈ దేశానికి అవ‌స‌ర‌మ‌ని పేర్కొన్నారు. సెక్యుల‌ర్ దేశంగా భార‌త్ ఉండాలంటే కేసీఆర్ నాయ‌క‌త్వం అవ‌స‌ర‌మ‌ని చెప్పారు. మ‌త‌త‌త్వ పార్టీల‌తో దేశానికి ముప్పు ఉంద‌న్నారు. దేశ ర‌క్ష‌ణ కోసం మ‌న‌మంతా కలిసి ఉండాల‌ని సూచించారు. తెలంగాణ క్రైస్త‌వులంద‌రూ కేసీఆర్ వెంటే ఉన్నారు. జాతీయ పార్టీ ప్ర‌క‌టిస్తున్న నేప‌థ్యంలో కేసీఆర్‌కు శుభాంక్షాలు తెలియ‌జేస్తూ.. దేవుడి ఆశీస్సులు ఉండాల‌ని ప్రార్థిస్తున్నామ‌ని సాల్మ‌న్ రాయ్ పేర్కొన్నారు.