చెడు వ్యసనాలకు బానిసైన కొడుకు సరైన గుణపాఠం చెప్పిన తల్లి..

చెడు వ్యసనాలకు బానిసైన కొడుకును చూసి ఆ తల్లి తల్లడిల్లిపోయింది. ఎన్నిసార్లు మంచి మాటలు చెప్పి చూసినా ఫలితం లేకుండా పోయింది. కన్న కొడుకును మార్చుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో అమ్మ ఆగ్రహంతో ఊగిపోయింది. కొడుకును కరెంటు స్తంభానికి కట్టేసి కళ్లలో గొడ్డుకారం పోసి కొట్టింది…సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని గాంధీనగర్కు 15ఏళ్ల బాలుడు గంజాయికి అలవాటుపడ్డాడు. చెడు వ్యసనం వదిలిపెట్టాలని తల్లిదండ్రులు ఎన్నిసార్లు చెప్పినా పెడచెవిన పెట్టాడు. గత 10 రోజుల నుంచి ఇంటికి రాకపోవడంతో కన్నతల్లి తల్లడిల్లిపోయింది. కొడుకును వెతికిపట్టుకుని ఇంటికి తీసుకొచ్చింది. అతని జేబులు వెతకగా.. గంజాయి ప్యాకెట్ దొరికింది. దీంతో కోపంతో ఊగిపోయిన తల్లి ఆ బాలున్ని కరెంటు స్తంభానికి కట్టేసింది. కాళ్లలో కారం కొట్టి చితకబాదింది. కొడుకును మార్చేందుకు తల్లి పడుతున్న ఆవేదనకు సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్గా మారింది.