ఎంపీపీ చింతా కవితా తమ పదవికి రాజీనామా..

సూర్యాపేట జిల్లా,
కోదాడ.
ఎంపీపీ చింతా కవితా రెడ్డి సోమవారం తమ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను జెడ్పీ సీఈవో సురేష్ కుమార్కు అందజేశారు. నిజానికి ఈ నెల 17 ఆమెపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. సొంత పార్టీ బీఆర్ఎస్ కు చెందిన మెజారిటీ ఎంపీటీసీలు అవిశ్వాస తీర్మానానికి అనుమతి కోరడంతో ఆమె ముందస్తుగానే తన పదవికి రాజీనామా చేశారు. గతంలో ఈమె పై , పార్టీ వర్గాల్లో పలు ఆరోపణలు వెల్లువెత్తా కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ షాడోగా వ్యవహరిస్తూ పలు రకాల అవినీతి పాల్పడ్డారని నియోజకవర్గ ప్రజలు పలు ఆరోపనలు చేశారు. మల్లయ్య యాదవ్ ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో ఈమె పై అసహనం నివురుగప్పిన నిప్పులా ఉందని, మల్లయ్య ఓటమితో ఈ అసమ్మతి బయటపడటమే ఈమె రాజీనామాకు కారణమని పలువురు అంటున్నారు…