కేదార్‌నాథ్ ఆలయం ఏప్రిల్ 25వ తేదీన ఓపెన్…

జ్యోతిర్లింగ క్షేత్ర‌మైన‌ కేదార్‌నాథ్ ఆల‌యాన్ని ఏప్రిల్ 25వ తేదీన ఓపెన్ చేయ‌నున్నారు…

ఈ విష‌యాన్ని కేదార్‌నాథ్ ఆల‌య క‌మిటీ చైర్మెన్ తెలిపారు…

చార్‌థామ్ యాత్ర‌లో భాగంగా కేదార్‌నాథ్ ఆల‌య ద్వారాల‌ను ఏప్రిల్ 25వ తేదీన తెర‌వ‌నున్న‌ట్లు ఆయ‌న చెప్పారు…

మ‌హాశివ‌రాత్రి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా ఆల‌య ద్వారాల ఓపెనింగ్‌కు సంబంధించిన విష‌యాన్ని ప్ర‌క‌టించారు…

ఊకిమ‌ఠ్‌లోని ఓంకారేశ్వ‌ర్ ఆల‌యంలో .. కేదార్‌నాథ్ ఓపెనింగ్‌కు సంబంధించిన ప్ర‌క‌ట‌న చేశారు…

ఈ సంద‌ర్భంగా ఓంకారేశ్వ‌ర్ ఆల‌యాన్ని కూడా స‌ర్వాంగ సుంద‌రంగా అలంక‌రించారు…