కేదార్‌నాథ్‌లో కూలిన హెలికాప్టర్‌..ఆరుగురు మృతి…

కేదార్‌నాథ్‌కు భక్తులతో వెళ్తున్న ఓ హెలికాప్టర్‌ కుప్పకూలింది. ఇద్దరు పైలెట్లతో పాటు మొత్తం ఆరు మంది ఆ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఫటా నుంచి భక్తులతో హెలికాప్టర్‌ బయలుదేరింది. హెలికాప్టర్‌ కూలిన ప్రదేశంలో భారీగా పొగలు వ్యాపించాయి. చెల్లాచెదురుగా హెలికాప్టర్‌ శిథిలాలు పడి ఉన్నాయి. ప్రమాదం జరిగిన ప్రాంతానికి రెస్క్యూ సిబ్బంది వెళ్లినట్లు అధికారులు చెప్పారు…ఉత్తరాఖండ్‌లోని హిమాలయాల్లో జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్‌నాథ్‌ ఉన్న విషయం తెలిసిందే. సాధారణంగా వేసవి కాలం నుంచి ఆలయం దర్శనం కోసం తెరి ఉంచుతారు. దీపావళి వరకు ఈ ఆలయంలో భక్తులకు దర్శనాలు ఉంటాయి. అయితే ట్రెక్కింగ్ చేయలేని భక్తుల కోసం.. హెలికాప్టర్‌ సేవలు అక్కడ అందుబాటులో ఉంటాయి. కేదార్‌నాథ్‌లో ఇవాళ హెలికాప్టర్‌ విషాదం చోటుచేసుకోవడం శోచనీయం.