కేరళ ముఖ్యమంత్రి కుమార్తె పై మనీ లాండరింగ్ కేసు..!

కేరళ సీఎం పినరన్ విజయన్ కుమార్తె వీణ పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీలాండరింగ్ కేస్ నమోదు చేసింది. అక్రమ చెల్లింపులకు సంబంధించి వీణతో పాటు మరికొందరి పై ఈ కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది.

2017 – 2020 మద్య కొచ్చిన్ మినరల్స్ & రుటైల్ లిమిటెడ్ సంస్థ వీణకు 1.72 కోట్ల రూపాయలు చెల్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఒప్పందంలో సీపీఐ(ఎం) సహ కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూడీఫ్ పక్ష నేతలు ఉన్నట్లు సమాచారం.

ED మూలాల ప్రకారం, కొచ్చికి చెందిన ప్రైవేట్ కంపెనీ ‘కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటిల్ లిమిటెడ్’ (CMRL) వీణా విజయన్ యొక్క ఎక్సారాజిగ్ సొల్యూషన్స్‌లో 2017 మరియు 2018లో రూ. 1.72 కోట్లు చెల్లించింది. ఎలాంటి సేవలు పొందకుండానే ఈ చెల్లింపులు జరిగాయని ED వర్గాలు పేర్కొంటున్నాయి. వీణా విజయన్ సెలబ్రిటీతో సత్సంబంధాలు కలిగి ఉన్నందున సేవలను అందించకుండా ఎక్సాలాజిక్‌కు CMRL నెలవారీ చెల్లింపులు చేసిందని ఆరోపించారు.

అంతకుముందు, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో దర్యాప్తుపై ఎక్సాలాజిక్ కంపెనీ కర్ణాటక హైకోర్టులో ఫిర్యాదు చేసింది. అయితే, గత నెలలో ఈ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. కాగా, తన కుమార్తె తన భార్య పెన్షన్‌తో ఐటీ కంపెనీని ప్రారంభించిందని, ఆమెపై, ఆమె కుటుంబంపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని ముఖ్యమంత్రి పినరయి విజయన్ గతేడాది జనవరిలో కేరళ అసెంబ్లీలో చెప్పారు..