కేరళ లో తాజాగా నోరో వైరస్‌ కేసులు…

తాజాగా నోరో వైరస్‌ కేసులు వెలుగు చూశాయి. తిరువనంతపురం, విజింజంలో స్కూలుకు వెళ్లే ఇద్దరు పిల్లలకు నోరో వైరస్‌ సోకింది. దీంతో ఆ రాష్ట్ర వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. నోరో వైరస్‌ కేసులపై సమగ్ర సమాచారాన్ని కోరారు. 2021 జూన్‌లో కేరళలోని అలప్పుజ జిల్లాలో తొలి నోరో వైరస్‌ కేసు వెలుగు చూసింది. డయెరియాకు సంబంధించిన ఈ వైరస్‌ కేసులు గత ఏడాది 950 నమోదయ్యాయి. ఈ వైరస్‌ వ్యాప్తి నెలన్నర పాటు కొనసాగింది. వందల సంఖ్యలో పిల్లలు దీని బారిన పడ్డారు.నోరో వైరస్ అనేది ఓ అంటు వ్యాధి వైరస్. ఇది మన శరీరంలోకి ప్రవేశించగానే వాంతులు, విరేచనాలు అవుతాయి. శరీర జీర్ణ వ్యవస్థపై దాని ప్రభావం ఉంటుంది. ఈ వైరస్‌ని స్టమక్ ఫ్లూ లేదా స్టమక్ బగ్ అని కూడా అంటారు. కలుషిత ఆహార పదార్థాల ద్వారా వచ్చే ఈ వైరస్ పిల్లలే కాదు, పెద్దవారికి కూడా సోకుతుంది. US సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(CDC) ప్రకారం, ఈ వైరస్‌లో వివిధ రకాలు ఉన్నాయి. ఓ అధ్యయనం ప్రకారం, నోరోవైరస్‌ని గతంలో నార్వాక్ అని కూడా పిలిచారు. నార్వక్ నార్వాక్‌లో గ్యాస్ట్రో ఎంటరిటీస్ వ్యాప్తి సమయంలో మొదటిసారిగా ఈ వ్యాధిని గుర్తించారు. 1929లో శీతాకాలపు వాంతులుగా ఈ వ్యాధిని పిలిచేవారని తెలుస్తోంది. కాలానుగుణంగా వాంతులు ప్రాథమిక లక్షణంగా ఉన్నాయి. 1968లో ఎక్కువగా ఈ వైరస్ వ్యాప్తి చెందింది. ఆ సమయంలో 98 శాతం మందికి ఈ వ్యాధి సోకగా అందులో 92 శాతం మందికి వాంతులు, 58 శాతం మందికి కడుపులో నొప్పి, 52 శాతం మందికి బద్ధకం, 38 శాతం మందికి అతిసారం, 34 శాతం మందికి జ్వరం ఉందని తెలుస్తోంది..

లక్షణాలు చూస్తే వాంతులు, విరోచనాలు, కడుపులో నొప్పి, మంట, చలి, తలనొప్పి, కండరాల నొప్పులు ఇలా వైరస్ సోకిన 12 గంటలలోపు కనిపిస్తాయి. కొంతమందికి 1 లేదా 2 రోజుల తర్వాత కూడా కనిపించొచ్చు…