కేరళలో మళ్లీ నిపా వైరస్ విజృంభిస్తోంది. కోజిక్కోడ్‌లో గత కొద్దిరోజుల్లో నాలుగు నిపా వైరస్ కేసులు (Nipah virus alert in Kerala) వెలుగుచూశాయి. నిపా వైరస్ సోకిన రోగులలో ఇద్దరు (Kerala Nipah deaths) మరణించారు. నిపా వైరస కేసులు మళ్లీ రాష్ట్రంలో విజృంభిస్తుండడంతో కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జి అసెంబ్లీలో మాట్లాడుతూ పుణెకు చెందిన ఎన్‌ఐవి అధికారులు, చెన్నైకు చెందిన అంటువ్యాధుల నిపుణుల బృందం కోజిక్కోడ్‌ను సందర్శించనున్నట్లు తెలిపారు.ఇప్పటి వరకూ 130 మందికి నిపా వైరస్ నిర్దారణ అయినట్టు కేరళ ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు..
కేరళ లో మరోసారి నిఫా వైరస్ వ్యాప్తి కలవరపెడుతోంది. ఇప్పటికే ఈ వైరస్ బారిన పడి ఇద్దరు మృతి చెందారు. ‘నిఫా’ సోకిన వారు మరణించే అవకాశాలు చాలా ఎక్కువని భారత వైద్య పరిశోధన మండలి (ICMR) తెలిపింది..ఇది 40- 70 శాతం మధ్య ఉంటుందని వెల్లడించింది.
ప్రపంచాన్ని వణికించిన కొవిడ్ (COVID-19) విషయంలో ఇది కేవలం 2- 3 శాతం మాత్రమేనని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ భల్ చెప్పారు. కేరళలో ప్రస్తుతం ఒకే రోగి (Index Patient) నుంచి ఈ వైరస్ వ్యాప్తి మొదలైందన్నారు. స్థానికంగా నిఫా వ్యాప్తి కట్టడికి ప్రయత్నాలు కొనసాగుతున్నట్లు చెప్పారు. అయితే, కేరళలోనే ఈ వైరస్ తరచూ ఎందుకు వెలుగుచూస్తోందనేది తెలియదన్నారు..