కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు.

ప్రస్తుతం ఎండ వేడి తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు చల్లటి కబురు అందింది కేరళ నేడు నైరుతి రుతుపవనాలు తాగుతున్నాయి అనే సమాచారం ప్రజల్లో చల్లదనాన్ని నింపింది..
నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. సాధారణం కంటే మూడు రోజులు ముందుగానే ఆ రాష్ట్రాన్ని పలకరించినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
ఇటీవల అసని తుపాను ప్రభావంతో రుతుపవనాలు వేగంగా కదిలాయి. మరోవైపు ఈ రుతుపవనాలు మరో వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ఏడాది సాధారణ వర్షపాతం ఉంటుందని తెలిపింది.