టీడీపీకి కేశినేని నానీ గుడ్ బై…! టీడీపీ పార్టికి షాక్..!

*టీడీపీకి కేసినేని నాని గుడ్ బై..!*
R9TELUGUNEWS.com.
బిజెపి లోకి చేరే అవకాశం..
విజయవాడ కేశినేని పార్టీ కార్యాలయంలో చంద్రబాబు, ఎన్టీఆర్ ఫోటోలు తొలగింపు..

చంద్రబాబు ఎన్టీఆర్ ఫోటోలు స్థానంలో రతన్ టాటా తో దిగిన ఫోటోలు

బెజవాడ టిడిపిలో వర్గ విభేదాలు ఇప్పుడు ఆ పార్టీలో తారస్థాయికి చేరుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాక కార్యకర్తలలో కూడా ఆవేదన వ్యక్తమవుతోంది. అయితే ఇప్పుడు విజయవాడ ఎంపీ కేశినేని నాని త్వరలోనే కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని సమాచారం. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే ఆయన పార్టీకి రాజీనామా చేసే అవకాశాలున్నాయని సమాచారం.

పార్టీలో తనకు సహకరించడం లేదని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల మీద వైసిపి బలంగా దృష్టి పెట్టినా సరే తనకు నేతల నుంచి సహకారం రావడం లేదు అనే ఆవేదనలో కేసినేని నాని ఉన్నారు. తన కుమార్తె పోటీ చేయడం ఇష్టం లేని కొంతమంది నేతలు పార్టీని ఇబ్బంది పెడుతున్నారు అనే ఆవేదన కూడా కేసినేని నాని వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఆయన పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారని ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరుగుతోంది. దీనికి సంబంధించి ఆయన పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కూడా ఒక లేఖ రాయనున్నారు…

ఈరోజు ఢిల్లీలో కేంద్ర పెద్దలతో భేటీ
.
ఎటు వెళ్లాలి అనే ఆలోచనలతో ఆయన అనుచర వర్గం తో చర్చించి బీజేపీ వైపే ఎక్కువ మొగ్గు చూపిస్తున్నట్లుగా సమాచారం… నేడు ఢిల్లీ లో కేంద్ర పెద్దలతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లుగా ఆయన అనుచరులు ప్రచారం..