బాలీవుడ్‌లో కేజీఎఫ్2 చిత్రం వసూలు ప్రభంజనం….

బాలీవుడ్‌లో కేజీఎఫ్2 చిత్రం ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. ప్రశాంత్ నీల్ రూపొందించిన ఈ సినిమా జైత్రయాత్ర కొనసాగుతుండటంతో టైగర్ ష్రాఫ్, అజయ్ దేవగన్ నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పేలవమైన వసూళ్లను రాబడుతున్నది. ఏప్రిల్ 29న రిలీజైన హీరోపంతి 2, రన్ అవే 34 చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకొలేకపోవడంతో పెద్దగా వసూళ్లు నమోదు కాలేదని విషయాన్ని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.అజయ్ దేవగన్, అమితాబ్ బచ్చన్, రకుల్ ప్రీత్ సింగ్ నటించిన రన్‌అవే 34 చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద డీలా పడింది. స్టార్ హీరోలు నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయిందనే విషయం వసూళ్లు తెలియజెప్పుతున్నాయి. రన్‌అవే 34 చిత్రం తొలి రోజున 3 కోట్లు మాత్రమే వసూలు చేసింది. అయితే పాజిటివ్ టాక్‌తో రెండో రోజున 50 శాతం కలెక్షన్లను నమోదు చేసింది. రెండో రోజున 4.5 కోట్ల రాబట్టింది. మొత్తంగా ఈ చిత్రం రెండు రోజుల్లో 7.50 కోట్లు వసూలు చేసింది…బాలీవుడ్ చిత్రాలపై కేజీఎఫ్2 చిత్రం అధిపత్యం కొనసాగుతున్నది. మాస్ ప్రేక్షకులనే కాకుండా మల్టీప్లెక్స్ ఆడియెన్స్‌ను మెప్పిస్తున్నది. దాంతో చిత్రం హిందీలో 400 కోట్ల కలెక్షన్లకు చేరువైంది. మూడో వారంలో శుక్రవారం 4.25 కోట్లు, శనివారం 7.25 కోట్లు రాబట్టింది. ప్రస్తుతం ఈ చిత్రం హిందీ వెర్షన్ 360.31 కోట్ల బిజినెస్‌ను నమోదు చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా 1110 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టిన విషయం తెలిసిందే..