RRR రికార్డును బ్రేక్ చేసిన..KGF చాప్టర్ 2 ట్రైలర్…

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ నడుస్తోంది. వరుసపెట్టి బిగ్ బడ్జెట్ సినిమాలు ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే గతంలో వచ్చి సూపర్ డూపర్ హిట్ అయిన KGF సినిమాకు సీక్వల్‌గా KGF- 2 సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని ఏప్రిల్‌14న విడుదలకు సిద్దమైన ఈ సినిమా ప్రమోషన్స్ జోరు పెంచారు మేకర్స్. ఇందులో భాగంగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేయగా ఆ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది….ఇటీవల విడుదలైన KGF చాప్టర్ 2 ట్రైలర్ ఊహించని విధంగా రెస్పాన్స్ అందుకుంటుంది. అసలు ట్రైలర్ కు మొదట కొన్ని నెగెటివ్ కామెంట్స్ వచ్చినప్పటికీ కూడా 17 గంటల్లోనే మిగతా సినిమాల ట్రైలర్స్ రికార్డులను కూడా బ్లాస్ట్ చేయడం విశేషం. అంతే కాకుండా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం RRR ప్రభాస్ సినిమాలు 24 గంటల్లో క్రియేట్ చేసిన రికార్డును యష్ 15 గంటల్లోనే బ్రేక్ చేశాడు.
బస్సు డ్రైవర్ కొడుకు కన్నడ స్టార్ హీరోగా ఎదుగుతున్నాడు అని ఎవరూ ఊహించి ఉండరు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వతహాగా కష్టపడి పైకి వచ్చిన యష్ ఒక్క KGF సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారే స్థాయికి వచ్చాడు. ప్రస్తుతం KGF 2 కోసం కేవలం కన్నడ ప్రేక్షకుల మాత్రమే కాకుండా మిగతా భాషల్లో చాలా మంది అభిమానులు ఎదురు చూస్తున్నారు అని ఇటీవల విడుదలైన ట్రైలర్ తోనే ఒక క్లారిటీ వచ్చేసింది..