కేజీఎఫ్2 మూవీ రివ్యూ…..

న‌ట‌వ‌ర్గం : య‌శ్, సంజ‌య్ ద‌త్, శ్రీ‌నిధి శెట్టి, ర‌వీనా టాండ‌న్, ప్ర‌కాశ్ రాజ్, అర్చ‌న‌, రామ‌చంద్ర రాజు, అచ్యుత్ కుమార్, మాళ‌విక అవినాశ్, వ‌శిష్ఠ ఎన్.సింహ‌, ఈశ్వ‌రీరావు, రావు రమేశ్, టి. య‌స్. నాగాభ‌ర‌ణ‌, శ‌ర‌ణ్ శ‌క్తి త‌దిత‌రులు.
సినిమాటోగ్ర‌ఫి : భువ‌న్ గౌడ‌
సంగీతం : ర‌వి బ‌స్రూర్
నిర్మాత‌ : విజ‌య్ కిర‌గండూర్
క‌థ‌, ద‌ర్శ‌క‌త్వం: ప్ర‌శాంత్ నీల్
బ్యానర్: హాంబలే ఫిల్మ్స్
విడుదల అయిన రోజు. : 14/04/2022..

కథ :

గరుడని చంపి కె.జి.ఎఫ్ ని తన ఆదీనంలోకి తెచ్చుకున్న రాకీ (యశ్) తిరుగులేని విధంగా తయారవుతుండగా గరుడ తమ్ముడు అథీరా (సంజయ్ దత్) తన దారికి అడ్డు పడతాడు.. పి.ఎం రమిక సేన్ (రవీనా టాండన్) కూడా రాకీ సామ్రాజ్యాన్ని కూల్చాలని చూస్తుంది. ఇంతకీ వీళ్ల ప్రయత్నాలు ఏమయ్యాయి.. రాకీ చివరకు ఏమయ్యాడు అన్నది సినిమా కథ…
కే జి ఎఫ్: చాప్టర్ 1″ సినిమా ఎక్కడైతే ముగుస్తుందో “కే జి ఎఫ్: చాప్టర్ 2” అక్కడే మొదలవుతుంది. రాకీ కే జి ఎఫ్ నీ సొంతం చేసుకున్నాడు. కానీ కే జి ఎఫ్ మీద చాలా మందికి కన్ను ఉంది. అందులో వైకింగ్స్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న అధీరా (సంజయ్ దత్) కూడా ఒకరు. దీంతో రాఖీ మరియు అధీరా లకు మధ్య యుద్ధం మొదలవుతుంది. శ్రీనిధి శెట్టి ఈ గొడవలో ఎలా ఇన్వాల్వ్ అయింది? ప్రైమ్ మినిస్టర్ కి దీని కి మధ్య సంబంధం ఏంటి? రాకీ మరియు అధీర లలో ఎవరు గెలిచారు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే…

విశ్లేషణ :
కె.జి.ఎఫ్ చాప్టర్ 1 సూపర్ హిట్ కాగా ఆ అంచనాలను ఏమాత్రం తగ్గకుండా హీరో ఎలివేషన్, టైట్ స్క్రీన్ ప్లే, అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఆకట్టుకునే సినిమాటోగ్రఫీతో కె.జి.ఎఫ్ చాప్టర్ 2 వచ్చింది. సినిమా చూసే ఆడియెన్స్ అందరిని తన మాయలో పడేశాడు డైరక్టర్ ప్రశాంత్ నీల్.
కె.జి.ఎఫ్ చాప్టర్ 1 కి కొనసాగింపుగా దానికి పర్ఫెక్ట్ సీక్వెల్ గా చాప్టర్ 2 వచ్చింది. సినిమాలో కథ పెద్దగా లేకపోయినా దాన్ని నడిపించిన తీరు మెప్పించింది. ఇక మాస్ ఆడియెన్స్ కి నచ్చే అంశాలు.. రోమాలు నిక్కబొడుకునే సన్నివేశాలు చాలానే ఉన్నాయి. కె.జి.ఎఫ్ మ్యాజిక్ ని మళ్లీ ఈ పార్ట్ 2 లో కూడా కొనసాగేలా చేశాడు డైరక్టర్ ప్రశాంత్ నీల్.
సినిమా చూస్తున్నంత సేపు ఆడియెన్స్ కూడా ఊగిపోయేలా చేశాడు. ప్రేక్షకులు సినిమాకు కనెక్ట్ అయ్యేలా మొదటి సన్నివేశం నుండే డైరక్టర్ సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. కె.జి.ఎఫ్ చాప్టర్ 1కి ఇది పర్ఫెక్ట్ సీక్వల్ గా వచ్చి మాస్ అండ్ క్లాస్ ఆడియెన్స్ ని అలరిస్తుంది. ఎంత పెద్ద మాస్ సినిమా అయినా మదర్ సెంటిమెంట్ ని మేళవించి డైరక్టర్ ప్రశాంత్ నీల్ తన అద్భుతమైన ప్రతిభ కనబరించాడని చెప్పొచ్చు…..