ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు హైకోర్టు నోటీసులు ..

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎన్నికను సవాలు చేస్తూ దాఖలైన ఎన్నికల పిటిషన్ పై హైకోర్టు శుక్రవారం ఎమ్మెల్యేకు నోటీసులు జారీచేసింది. ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ కాంగ్రెస్ అభ్యర్థి విజయా రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి విచారణ చేపట్టారు..
ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తూ డబ్బులు పంచిపెట్టి అనైతికంగా గెలిచారని దీనిపై సంబంధించినా పోలీసుస్టేషన్స్ లో కేసులు కూడా నమోదు అయ్యాయని, ఇది పూర్తిగా ప్రజా ప్రాతినిధ్య చట్టానికి వ్యతిరేకం అని వాదించారు. దానం నాగేందర్ తన భార్యకు సంబంధించిన ఆస్తి వివరాలను నామినేషన్ పత్రాల్లో పేర్కొనలేదన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఎన్నికపై వివరణ ఇవ్వాలంటూ దానం నాగేందర్ కు నోటీసులు జారీ చేస్తూ విచారణను వచ్చే నెల 18 వాయిదా వేశారు.