ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..

ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సత్తుపల్లి పట్టణ శివారులో జరిగిన రెండు వెర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు డ్రైవర్లు మృతిచెందారు. పట్టణ శివార్లలోని వైకుంఠధామం వద్ద రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఒక లారీ డ్రైవర్ మృతిచెందగా ..మరో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి.కాగా పట్టణ శివార్‌లోని పెద్ద వంతెన వద్ద అశోక్ లైలాండ్ వాహనాన్ని తప్పించబోయి..చెట్టును ఢీ కొట్టి మరో డీసీఎం వ్యాన్‌ డ్రైవర్‌ మృతిచెందాడు..