ఖమ్మం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం…

..

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారంలో నకిలీ నోట్లు (Fake Notes) కలకలం రేపుతున్నాయి. అర్ధరాత్రి సమయంలో కిష్టారం పెట్రోల్ బంక్‌ (Petrol Bunk)లో 5 వేల రూపాయల డీజిల్ కొట్టించుకొని గుర్తు తెలియని వ్యక్తులు పది రూ.500 నకిలీ నోట్లు ఇచ్చారు..

వాటిని సిబ్బంది గుర్తించి వెంటనే కారును పట్టుకునేందుకు ప్రయత్నించడంతో సదరు వ్యక్తులు అక్కడి నుంచి కారుతో పరారయ్యారు. ఆ కారు ఖమ్మం వైపు నుంచి వచ్చిందని సిబ్బంది చెబతున్నారు. బంకు సిబ్బంది ఫిర్యాదు మేరకు సత్తుపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు..