ఖమ్మం జిల్లా లో నాటు తుపాకీతో భార్యను కాల్చిన భర్త…

ఖమ్మం జిల్లా లో నాటు తుపాకీతో భార్యను కాల్చిన భర్త..

*ఖమ్మం జిల్లా :*

భద్రాద్రి జిల్లా :జూన్ 16

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో గురువారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. భోజ్యా తండా పంచాయతీ పరిధిలోని పుల్లుడు తండాలో లావుడ్యా సామ అనే వ్యక్తి తరుచుగా మద్యం సేవించి భార్య శాంతిపై గొడవపడుతూ ఉండేవాడు..

ఈ క్రమంలో గురువారం రాత్రి ఇంటికి వచ్చాక భార్యతో గొడవపడిన సామ తన భార్య బయట దుకాణానికి వెళ్లి వస్తున్న క్రమంలో నాటు తుపాకితో వెనుక నుండి కాల్పులు జరిపాడు. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోవడంతో సామ పరారయ్యాడు.

విషయం తెలుసుకున్న జూలూరుపాడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రక్తపు మడుగులో పడి ఉన్న శాంతిని కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స చేసిన డాక్టర్లు పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. కాగా గుండ్ల రేవు పంచాయతీ పరిధిలో ఉండే భర్త నాటు తుపాకితో భార్య గ్రామానికి వచ్చి కాల్పులు జరపడంతో కలకలం రేగింది. గ్రామానికి ఆనుకుని ఉండే అడవిలో జంతువులను వేటాడానికి సామ నాటు తుపాకీ వాడే వాడని దానితోనే ఇప్పుడు భార్య పై కాల్పులు జరిపాడని శాంత తల్లి, పిల్లలు బోరున విలపిస్తున్నారు. శాంతకు ముగ్గురు ఆడపిల్లలు, ఒక మగ పిల్లాడు ఉన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న సామ కోసం గాలిస్తున్నారు…..