ఖిలాడి..రవితేజ..మూడో పాటకు సంబంధించిన ప్రోమోతో పాటు పాట విడుదల ప్రకటన…..

మాస్ మహారాజ్ రవితేజ ఈ యేడాది ‘క్రాక్’ మూవీతో బోణీ చేసారు. ఈ సినిమా ఈ యేడాది తొలి హిట్‌గా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ప్రస్తుతం రవితేజ ‘ఖిలాడి’ మూవీ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి మూడో పాటకు సంబంధించిన ప్రోమోతో పాటు పాటను ఎపుడు విడుదల చేసేది ప్రకటించారు..ఈ యేడాది ‘క్రాక్’ మూవీతో బోణీ చేసారు. ఈ సినిమా ఈ యేడాది తొలి హిట్‌గా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. కరోనా నేపథ్యంలో సగం ఆక్యుపెన్షీతో ఆడియన్స్ థియేటర్స్‌కు వస్తారా రారా అనే దానికి పులిస్టాప్ పెడుతూ.. ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టింది. అంతేకాదు ఈ చిత్రం రవితేజ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచి కొత్త ఊపిరిని ఇచ్చింది. మరోవైపు బలుపు, డాన్ శీను తర్వాత క్రాక్‌తో గోపీచంద్ మలినేనితో రవితేజ హాట్రిక్ హిట్ నమోదు చేసారు. ఇక ఆ సినిమా తర్వాత ఆయన వరుసగా సినిమాలను చేస్తున్నారు. అందులో భాగంగా రవితేజ, రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడీ’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టీజర్, ట్రైలర్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో రవితేజ సరసన డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. అనసూయ కీలక పాత్రలో కనిపించనున్నారు..ఖిలాడి’ విషయానికొస్తే.. ఈ మూవీ యాక్షన్ కింగ్ అర్జున్ ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. క్రాక్ తర్వాత ఈ సినిమా రావడంతో ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ పై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఇక తాజాగా ఈ సినిమా విడుదలపై క్లారిటీ వచ్చింది.ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు..

ఈ సినిమాను ‘ఆన్ డ్యూటీ’ అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రంలో రవితేజ ఎమ్మార్వో ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు.

అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌తో కలిసి రవితేజ ప్రొడక్షన్ నిర్మాణం వహిస్తున్నారు. కాగా ఈ సినిమాకు టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. రవితేజని “రావణాసుర” గా పరిచయం చేశారు. ఒక భారీ కపాలం పై కూర్చొన్నారు మాస్ మహా రాజ్. పోస్టర్‌లో రవితేజకు 9 తలలు ఉన్నాయి. ఇక ఆయన ఇటీవల ఓ ప్యాన్ ఇండియా సినిమాను ప్రకటించారు. టైగర్ నాగేశ్వరావుగా వస్తోన్న సినిమాకు వంశీ దర్శకత్వం వహించనున్నారు…